కావేరీ సమస్య: రెండు పరిష్కారాలు, సీఎం స్పందన బాగుంది: కమల్ హాసన్

First Published 4, Jun 2018, 1:09 PM IST
Kamal Haasan Meets HD Kumaraswamy,   Cauvery On Agenda
Highlights

కావేరీ వివాదంపై కమల్, కుమారస్వామి చర్చలు

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్ డి 
కుమారస్వామితో  సినీ నటుడు, పొలిటీషీయన్ కమల్ హసన్
 సోమవారం నాడు కలుసుకొన్నారు. కావేరీ నదీ జలాల
వివాదంపై వీరిద్దరూ చర్చించారు.  కావేరీ జలాల వివాదంపై రెండు రాష్ట్రాల మధ్య కొంత
కాలంగా వివాదం సాగుతోంది. కావేరీ బోర్డును ఏర్పాటు
చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.కానీ, కేంద్రం
ఇంతవరకు కావేరీ బోర్డును ఏర్పాటు చేయలేదు.

 

కావేరీ బోర్డు ఏర్పాటు  చేయాలనే డిమాండ్ తోతమిళనాడులో అన్ని పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. ఈ తరుణంలో కమల్‌హసన్ కర్ణాటక సీఎం కుమారస్వామితో
చర్చించారు.

మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ చర్చించారు.బెంగుళూరులో వీరిద్దరి మధ్య చర్చ దాదాపు గంటసేపు కొనసాగింది. అనంతరం మీడియాతో కమల్ మాట్లాడారు, తమ మధ్య ఆరోగ్యకరమైన చర్చ నడిచిందని చెప్పారు. కుమారస్వామి స్పందన ఎంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగించే విధంగా ఉందని అన్నారు. 

కోర్టు వెలుపల ఈ సమస్యను పరిష్కరించుకునే వీలుందా? అనే ప్రశ్నకు బదులుగా  ఇరు రాష్ట్రాలు కావేరి జలాలను పంచుకుంటున్నాయని చెప్పారు.ఈ సమస్య తీరేందుకు రెండు వేర్వేరు మార్గాలు ఉన్నాయని  చెప్పారు. కుమారస్వామి కూడా ఈ అంశాన్ని ఇదే కోణంలో చూస్తుండటం ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు.

తమిళనాడు తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ ను మూసివేయాలని జరిగిన నిరసనలు, పోయిన ప్రాణాలను ప్రస్తావిస్తూ, సమస్యల పరిష్కారానికి ప్రజలు రోడ్లెక్కితే, తమిళనాడు శ్మశానంలా మారుతుందంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలతో తాను విబేధిస్తున్నట్టు కమల్ హాసన్ చెప్పారు.

loader