Asianet News TeluguAsianet News Telugu

త్వరలోనే న్యాయవ్యవస్థ పేపర్‌లెస్ అవుతుంది: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు

కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ త్వరలోనే న్యాయవ్యవస్థ పేపర్ లెస్ అవుతుందని అన్నారు. ఈ మేరకు న్యాయశాఖ అధికారులతో ఇది వరకే చర్చించానని, త్వరలోనే సీజేఐ చంద్రచూడ్‌తో సమావేశం కాబోతున్నట్టు వివరించారు.
 

judiciary soon become paperless says union law minister kiren rijiju
Author
First Published Dec 6, 2022, 7:54 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో భారత న్యాయవ్యవస్థ పేపర్‌లెస్ అవుతుందని వివరించారు. దీనిపై ఇది వరకే న్యాయశాఖ అధికారులతో చర్చించానని చెప్పారు. ఇ-కోర్టు ప్రాజెక్టు ఎలా ప్రారంభం కానుంది? ఎలా ఉండబోతుంది? అనే విషయాలపై సమగ్రంగా చర్చలు జరిపినట్టు ఆయన తెలిపారు.

జ్యూడీషియల్ సిస్టమ్‌లో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీని జోడించి మార్పులు తీసుకురావడమే ఇ-కోర్టుల ప్రాజెక్టు లక్ష్యం అని వివరించారు. కాబట్టి త్వరలోనే తాను సీజేఐ డీవై చంద్రచూడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు చెందిన బృందంతో సమావేశం కాబోతున్నట్టు తెలిపారు. అంతేకాదు, ఇ-కమిటీ చైర్‌పర్సన్‌గా దిగిపోవడానికి ముందు అన్ని సమస్యలను పరిష్కరించాలని తాను సీజేఐ డీవై చంద్రచూడ్‌కు విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు.

Also Read: ప్రతి పౌరుడికి న్యాయం అందాలి.. కోర్టుల వద్దకు ప్రజలు కాదు.. ప్రజల వద్దకే కోర్టులు వెళ్లాలి: సీజేఐ

కేసుల పెండింగ్ విషయంపై మాట్లాడుతూ మొత్తం పెండింగ్ కేసులు సుమారు 5 కోట్ల వరకు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ స్థాయిలో పెండింగ్ కేసులు ఉండటం బాధాకరం అని పేర్కొంటూ వాటన్నింటికీ సింగిల్ విండో  ప్లాట్‌ఫామ్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios