బీజేపీలో చేరండి.. లేకపోతే కూల్చివేతకు బుల్డోజర్ కు రెడీగా ఉంది - మధ్యప్రదేశ్ మంత్రి వార్నింగ్ వీడియో వైరల్
మధ్యప్రదేశ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికార బీజేపీలో చేరాలని లేకపోతే కూల్చివేసేందుకు బుల్డోజర్ సిద్ధంగా ఉందని వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలను అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరాలని లేకపోతే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుల్డోజర్ కూల్చివేతకు సిద్ధంగా ఉందని ఆ రాష్ట్ర మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వార్నింగ్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై కాంగ్రెస్ మండిపడింది.
ఇక నుంచి సినిమాలకు మత సెన్సార్ బోర్డు కూడా.. హిందూ దేవుళ్లని అవమానించే చిత్రాలను పర్యవేక్షించడానికే!
మహేంద్ర సింగ్ సిసోడియా ఆ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. జనవరి 20న జరగనున్న రఘోఘర్ నగర్ సివిల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గుణ జిల్లాలోని రుతియాయ్ పట్టణంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ వేధికపైనే మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
88 ఏళ్ల లేటు వయసులో రూ. 5 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు.. ఆ డబ్బుతో ఏం చేస్తాడంటే?
‘‘బీజేపీలో చేరండి. ఇటువైపు రండి. 2023లో (రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో) కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మామా (శివరాజ్ సింగ్ చౌహాన్) బుల్డోజర్ సిద్ధంగా ఉంది’’ అని మంత్రి అన్నారు. అయితే మరోవైపు బీజేపీపై కాంగ్రెస్ మండిపడింది. సిసోడియా వ్యాఖ్యలు అధికార బీజేపీ ప్రతిష్టకు మచ్చ తెచ్చాయని గుణ జిల్లా కాంగ్రెస్ చీఫ్ హరిశంకర్ విజయవర్గీయ అన్నారు.
మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా తన భాష పట్ల సంయమనం పాటించాలని హరిశంకర్ విజయవర్గీయ సూచించారు. జనవరి 20వ తేదీన జరిగే ఎన్నికల్లో రఘోఘర్ ప్రజలు ఆయనకు తగిన సమాధానం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. కాగా.. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న
రఘోఘర్ ప్రాంతం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ స్వస్థలం. ఆయన కుమారుడు జైవర్ధన్ సింగ్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, ఈ ఏడాది జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ విశ్వాసం వ్యక్తం చేసింది.
బురఖాను వ్యతిరేకించే వారిని నగ్నంగా ఊరేగించాలి- మొరాదాబాద్ కాలేజీ వివాదంపై అలీఘర్ మాజీ ఎమ్మెల్యే
ఇదిలా ఉండగా.. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల మాదిరిగానే మధ్యప్రదేశ్‌లోని అడ్మినిస్ట్రేషన్ వివిధ నేరాలకు పాల్పడిన వ్యక్తుల అక్రమ ఆస్తులు, ఇళ్లలను బుల్డోజర్ తో కూల్చివేస్తోంది. వీటిని శివరాజ్ సింగ్ చౌహాన్ తరచుగా ప్రశంసిస్తుంటారు. నేరాలు, నేరస్థుల పట్ల శివరాజ్ ప్రభుత్వం జీరో టాలరెన్స్ కు ఇది చిహ్నం అని పేర్కొంటుంది. గత ఏడాది డిసెంబర్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి బాలికను కొట్టిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో అధికారులు అతడి బుల్డోజర్‌లో కూల్చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సీఎం షేర్ చేస్తూ.. ‘‘ మధ్యప్రదేశ్ గడ్డపై మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారెవరూ తప్పించుకోలేరు’’ అని పేర్కొన్నారు.