జియో డబల్ దమాకా.. ఎయిర్ టెల్ కి షాక్

Jio Double Dhamaka Offer Giving Users 1.5GB Additional Data Per Day on Prepaid Recharges
Highlights

వినియోగదారులకు ఉచితంగా 1.5జీబీ

 ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్  జియో.. ఎయిర్‌టెల్‌కు షాకిచ్చింది. జియోకు పోటీగా ఎయిర్‌టెల్ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌లు ప్లాన్ల‌కు మార్పులు చేర్పులు చేస్తూ, అద‌న‌పు మొబైల్ డేటాను అందిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం జియో వంతు వ‌చ్చింది. ఎయిర్‌టెల్‌కు గ‌ట్టి షాక్ ఇచ్చేలా జియో త‌న వినియోగ‌దారుల‌కు సంచ‌ల‌న ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. దాని ప్ర‌కారం జియో క‌స్ట‌మ‌ర్లంద‌రికీ రోజూ 1.5 జీబీ అద‌న‌పు డేటా ల‌భిస్తుంది. జియోలో రోజువారీ డేటా లిమిట్ ప్లాన్ల‌ను వాడేవారికి ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. 

జియో ప్ర‌క‌టించిన ఆఫర్ ప్ర‌కారం.. రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్లాన్ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు రోజుకు 1.5 జీబీ డేటా ల‌భించగా ఇక‌పై రోజుకు 3 జీబీ డేటా ల‌భిస్తుంది. అలాగే రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్లాన్ల‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు రోజుకు 2 జీబీ డేటా వ‌స్తుండ‌గా ఇక‌పై రోజుకు 3.5 జీబీ డేటా ల‌భిస్తుంది. అదే విధంగా రూ.299 ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటాకు బ‌దులుగా 4.5 జీబీ డేటా, రూ.509 ప్లాన్‌లో రోజుకు 4 జీబీ డేటాకు బ‌దులుగా 5.5 జీబీ డేటా, రూ.799 ప్లాన్‌లో రోజుకు 5 జీబీ డేటాకు బ‌దులుగా 6.5 జీబీ డేటా ల‌భిస్తుంది. ఈ ఆఫ‌ర్ ఈ రోజు సాయంత్రం యాక్టివేట్ కానుండ‌గా ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంది. దీంతో ఈ నెల మొత్తం క‌స్ట‌మ‌ర్లు రోజుకు 1.5 జీబీ డేటాను అద‌నంగా పొంద‌వ‌చ్చు. 

ఇక జియోలో రూ.399 ప్లాన్‌ను జియో యాప్‌లో ఫోన్‌పే ద్వారా రీచార్జి చేసుకునే వారికి రూ.100 డిస్కౌంట్ ల‌భిస్తున్న విష‌యం విదిత‌మే. కాగా ఈ ఆఫ‌ర్ గ‌డువును పొడిగించారు. అలాగే రూ.300 క‌న్నా తక్కువ విలువ ఉన్న ప్లాన్ల‌ను రీచార్జి చేసుకుంటే వినియోగ‌దారుల‌కు 20 శాతం డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలో రూ.149 ప్యాక్ ధ‌ర రూ.120 అవుతుంది. ఇక ఈ ప్లాన్‌లో పైన తెలిపిన అద‌న‌పు డేటా క‌లుపుకుని రోజుకు 3 జీబీ డేటా వ‌స్తుంది.

loader