లవ్ బ్రేకప్ చెప్పిందని.. గన్ తో కాల్చాడు

Jilted lover shoots girlfriend after breakup in Delhi, arrested
Highlights

అభిరుచులు మరొకరికి నచ్చకపోతే.. వెంటనే బ్రేకప్ చెప్పేస్తారు. ఇది సర్వ సాధారణం. కానీ.. అలా బ్రేకప్ చెప్పినందుకే ఓ యువతి ప్రాణాల మీదకి వచ్చింది

ప్రేమించుకున్న వారిలో పెళ్లిపీటలు ఎక్కేవారు చాలా తక్కువ మందే ఉంటారు. ప్రేమలో ఉన్నప్పుడే ఒకరి అభిప్రాయాలు, అభిరుచులు మరొకరికి నచ్చకపోతే.. వెంటనే బ్రేకప్ చెప్పేస్తారు. ఇది సర్వ సాధారణం. కానీ.. అలా బ్రేకప్ చెప్పినందుకే ఓ యువతి ప్రాణాల మీదకి వచ్చింది.  ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ల్లీలోని భరత్‌ నగర్‌కు చెందిన 24 ఏళ్ల యువతి ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ)గా పనిచేస్తోంది. స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్‌ ఉద్యోగి, ఆమె ప్రేమించుకున్నారు. కొంతకాలం తర్వాత మనస్పర్థలు రావడంతో వీరు విడిపోయారు. జగ్రాన్‌ మండల్‌లో పనిచేసే ప్రియుడి తీరు నచ్చక పోవడంతో ఆమె అతడికి బ్రేకప్‌ చెప్పేసింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న ఆ యువకుడు మాజీ ప్రేయసి బంధువుల ఇంటికి వెళ్లిందన్న విషయం తెలుసుకున్నాడు. 

ప్లాన్‌ ప్రకారం తుపాకీ తీసుకుని ప్రేయసి బంధువుల ఇంటికి వెళ్లాడు. ఎవరో డోర్‌ తట్టారని ఆమె వెళ్లి చూడగా.. ఒక్కసారిగా తూటాల శబ్ధం వచ్చింది. బంధువులు వచ్చి చూడగా బుల్లెట్‌ గాయాలతో బాధితురాలు పడి ఉంది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాలకేం ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నారు. కాగా, బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని శాదరలో అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం వెల్లడించారు. తనకు బ్రేకప్‌ చెప్పినందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు.

loader