Asianet News TeluguAsianet News Telugu

Jharkhand: హైదరాబాద్ నుంచి రాంచీకి జార్ఖండ్ ఎమ్మెల్యేలు.. బలప్రదర్శనలో మాజీ సీఎం హేమంత్!

జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి తిరిగి రాంచీకి చేరుకున్నారు. సోమవారం శాసన సభలో బల ప్రదర్శన ఉన్న నేపథ్యంలో వారు తిరిగి రాంచీకి వెళ్లిపోయారు.
 

jharkhand mlas floor test on monday, jmm coalition legislators returned to ranchi from hyderabad kms
Author
First Published Feb 4, 2024, 11:24 PM IST | Last Updated Feb 4, 2024, 11:24 PM IST

Hemant Soren: జార్ఖండ్ ముక్తి మోర్చా సంకీర్ణ కూటమికి చెందిన సుమారు 37 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి తిరిగి రాంచీకి చేరుకున్నారు. జార్ఖండ్ శాసన సభలో సోమవారం బలప్రదర్శన నిర్వహిస్తున్నారు. జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎక్కడ ప్రలోభాలకు గురిచేస్తుందోనని వారిని హైదరాబాద్‌లోని శామీర్‌పేట్‌లోని ఓ రిసార్ట్‌కు తరలించారు. ఆ రిసార్ట్‌లోనే ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్‌లో ఈ ఎమ్మెల్యేలను ఫిబ్రవరి 2వ తేదీన హైదరాబాద్‌కు తరలించారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి రెండు లగ్జరీ బస్సుల్లో వారిని లియోనియా రిసార్ట్‌కు తరలించిన విషయం విధితమే.

హేమంత్ సోరెన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేయగా.. ప్రభుత్వ బాధ్యతలను జేఎంఎం సీనియర్ లీడర్, మంత్రి చంపయి సోరెన్‌కు అప్పగించారు. చంపయ్ సోరెన్ తమను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు.

ముఖ్యమంత్రిగా చంపయి సోరెన్ బాధ్యతలు తీసుకున్నారు. కానీ, అసెంబ్లీలో తన బలాన్ని చూపెట్టుకోవాల్సి ఉన్నది. సోమవారం జార్ఖండ్ అసెంబ్లీలో అధికార కూటమి తమ బలాన్ని ప్రదర్శించనుంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంపయి సోరెన్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. భద్రతకు సంబంధించి చర్చించారు.

Also Read : tdp janasena alliance : సీట్ల సర్దుబాటుపై కీలక భేటీ .. 28కి చంద్రబాబు ఓకే, 45 కావాల్సిందేనంటూ పవన్ పట్టు

బలప్రదర్శనకు మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ కూడా రాబోతున్నారు. హేమంత్ సోరెన్ ఐదు రోజులపాటు ఈడీ కస్టడీలో ఉండాలి. అయితే.. స్పెషల్ కోర్టు మాజీ సీఎం హేమంత్ సోరెన్ రాష్ట్ర అసెంబ్లీలో బల ప్రదర్శనకు హాజరు కావడానికి అనుమతించింది. 

జార్ఖండ్‌లో అధికార కూటమికి 43 మంది శాసన సభ్యులు ఉన్నారు. జార్ఖండ్‌లో మొత్తం శాసన సభ్యుల సంఖ్య 81. ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీగా కనీసం 41 మంది ఎమ్మెల్యేలు ఉండాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios