tdp janasena alliance : సీట్ల సర్దుబాటుపై కీలక భేటీ .. 28కి చంద్రబాబు ఓకే, 45 కావాల్సిందేనంటూ పవన్ పట్టు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన టీడీపీ మధ్య పొత్తుల కోసం కసరత్తు జరుగుతోంది. చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్‌లు హైదరాబాద్, ఉండవల్లిలలో పలుమార్లు భేటీ అయ్యారు. 

tdp chief Chandrababu Naidu janasena president Pawan Kalyan Meeting In Undavalli ksp

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన టీడీపీ మధ్య పొత్తుల కోసం కసరత్తు జరుగుతోంది. చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్‌లు హైదరాబాద్, ఉండవల్లిలలో పలుమార్లు భేటీ అయ్యారు. కానీ సీట్ల పంపకాల విషయంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అటు వైపు చూస్తే వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం ఈ విషయంలో దూకుడు మీదున్నారు. లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి అభ్యర్ధులను ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో సీట్ల పంపకాలపై ఏదో ఒకటి తేల్చేయాలని చంద్రబాబు , పవన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. 

సీట్ల పంపకాల విషయమై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. జనసేనకు 28 సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే జనసేనాని మాత్రం 45 సీట్లు కావాలని అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఉభయగోదావరి, విశాఖ, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ సీట్లను పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నట్లుగా సమాచారం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 2 నుంచి 3 సీట్లను తమకు కేటాయించాలని జనసేనాని పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. 

ఈ నెల చివరి వారం నాటికి టీడీపీ, జనసేన పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి నుంచి ఇరు పార్టీల నేతలు, కేడర్ ప్రచారంలో దూసుకుపోవాలని ఇద్దరు నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. మరి పొత్తు పంచాయతీకి రెండు పార్టీలు చెక్ చెబుతాయా లేదంటే ఈ సస్పెన్స్ ఇంకొంత కాలం కొనసాగుతుందా అన్నది తెలియాల్సి వుంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios