Asianet News TeluguAsianet News Telugu

ఆధార్ లింక్‌లో పొరపాటు.. మరో వ్యక్తి బ్యాంక్ అకౌంట్‌ నుంచి రూ. 2 లక్షలు కాజేశాడు.. ‘మోడీ డబ్బులు అనుకున్నా’

జార్ఖండ్‌కు చెందిన జీత్రాయ్ సామంత్ ఆధార్ నెంబర్ మరో వ్యక్తి బ్యాంకు ఖాతాకు లింక్ అయింది. దీంతో ఆయన ఆధార్ నెంబర్ ఆధారంగా సర్వీస్ పాయింట్ నుంచి సుమారు రూ. 2 లక్షల వరకు విత్ డ్రా చేసుకున్నాడు. బాధిత వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. ఆ డబ్బులు వాపసు ఇచ్చేయాలని పోలీసులు అడగ్గా.. అవి మోడీ వేసినడబ్బులు అనుకుని విత్ డ్రా చేసుకున్నానని, తాను చెల్లించలేనని సమాధానం ఇచ్చాడు.
 

jharkhand man withdraw over 2 lakhs from another persons bank account after aadhaar number link error kms
Author
First Published Mar 28, 2023, 2:06 PM IST

న్యూఢిల్లీ: జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి మరో వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 2 లక్షల వరకు విత్ డ్రా చేసుకున్నాడు. పోలీసులు ఆ డబ్బు తిరిగి ఇచ్చేయాలని అడిగితే లేవని చెబుతున్నాడు. ఆ డబ్బులు ఎందుకు తీశావని ప్రశ్నిస్తే.. కరోనా కష్ట సమయంలో ప్రధాని మోడీ గారు తన బ్యాంకు అకౌంట్‌లో వేశారేమో అని అనుకున్నానంటూ సమాధానం ఇచ్చాడు. ఇంతకీ వేరే వ్యక్తి అకౌంట్ నుంచి ఇతను ఎలా డబ్బు తీయగలిగాడనే కదా డౌటు.. వేరే వ్యక్తి బ్యాంకు అకౌంట్‌కు నిందితుడి ఆధార్ కార్డు పొరపాటున లింక్ అయింది. నిందితుడు కూడా ఆ డబ్బును ఆధార్ కార్డు ద్వారానే కాజేశాడు.

ఈ కేసులో నిందితుడికి మూడు సార్లు నోటీసులు పంపినా కోర్టుకు లేదా పోలీసుల ముందు హాజరు కాలేదు. దీంతో మార్చి 24వ తేదీన అరెస్టు చేశారు. ఇంతకీ ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందామా?

జార్ఖండ్ పశ్చిమ సింగ్‌భమ్ జిల్లాలో 42 ఏళ్ల జీత్రాయ్ సామంత్ నివసిస్తున్నాడు. ఆయన బీడీ వర్కర్. ఆరుగురు పిల్లలకు తండ్రి. ఆయనకు జార్ఖండ్ రాజ్య గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఉన్నది. అదే బ్యాంకులో శ్రీమతి లాగూరి అకౌంట్ కూడా ఉన్నది. రెండేళ్ల క్రితం పొరపాటున జీత్రాయ్ సామంత్ ఆధార్ నెంబర్ లాగూరి అకౌంట్‌కు లింక్ చేశారు. అప్పటి నుంచి జీత్రాయ్ సామంత్‌కు లాగూరి అకౌంట్ నుంచి కామన్ సర్వీస్ సెంటర్‌ల నుంచి ఆధార్ కార్డు ద్వారా డబ్బులు తీసుకోవడం వీలైంది.

Also Read: Bengaluru: dating app వలలో Bank manager.. క‌స్ట‌మ‌ర్ల ఖాతాల నుంచి "మ‌యా లేడీ"కి రూ. 6 కోట్లు ట్రాన్స్ ఫ‌ర్

ఫస్ట్ కోవిడ్ లాక్‌డౌన్ విధించినప్పుడు తమ గ్రామంలో చాలా మంది ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ సహాయం చేస్తున్నాడని, అకౌంట్‌లలో డబ్బులు వేస్తున్నాడని మాట్లాడుకునేవారని జీత్రాయ్ సామంత్ అన్నాడు. చాలా మంది తమ ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్‌లలో బ్యాలెన్స్ చెక్ చేసుకునేవారని చెప్పాడు. తాను కూడా అలా చెక్ చేసుకుంటే తన ఖాతాలో (అది లాగూరి బ్యాంక్ ఖాతా) రూ. 1,12,000ల బ్యాలెన్స్ కనిపించిందని వివరించాడు. వెంటనే గ్రామీణ బ్యాంక్‌కు పరుగెత్తి అడిగానని, కానీ, తన ఖాతాలో ఏ డబ్బులూ క్రెడిట్ కాలేవని అధికారులు చెప్పారని పేర్కొన్నాడు. ఈ డబ్బుల గురించి అడగ్గా.. ప్రభుత్వం పంపిందేమో అని అధికారులు చెప్పారని తెలిపాడు.

ఆ తర్వాత కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి డబ్బులు చెక్ చేస్తే అలాగే ఉన్నాయి. అప్పటి నుంచి తనకు అవసరం ఉన్నప్పుడళ్లా రూ. 500 నుంచి రూ. 5000 వరకు ఆధార్ కార్డు నెంబర్ ద్వారా ఆ సర్వీస్ పాయింట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేయడం ప్రారంభించాడు.

ఇదిలా ఉండగా సెప్టెంబర్ 2022లో గ్రామీణ బ్యాంక్‌కు శ్రీమతి లాగూరి నుంచి ఫిర్యాదు అందింది. తన ఖాతాలో డబ్బులు కనిపించకుండా పోతున్నాయని ఆమె ఫిర్యాదు చేసింది. అప్పుడు అధికారులు ఈ ఆధార్ లింక్‌లోని పొరపాటును గుర్తించారు. గ్రామీణ బ్యాంక్ స్పాన్సర్షిప్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎస్బీఐ చేతికి వచ్చిందని, అప్పుడే 2019 ఏప్రిల్‌లో డేటా మొత్తం ఎస్బీఐతో మెర్జ్ చేశామని బ్యాంక్ మేనేజర్ మనీశ్ కుమార్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు తెలిపారు. అప్పుడే జీత్రాయ్ సామంత్ ఆధార్ కార్డు నెంబర్ పొరపాటున మరొక బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయి ఉండొచ్చని చెప్పారు. తమకు లాగూరి ముందుగానే ఫిర్యాదు చేస్తే ఆ డబ్బులు పోకుండా అడ్డుకోగలిగేవారిమని వివరించారు. దీనికి కేవలం ఒక్క బ్యాంక్ అధికారిని తప్పుగా చూపించడం సరికాదని వాదించారు.

Also Read: పొరపాటున బ్యాంకు ఖాతాలోకి రూ. 4.6 కోట్లు.. అంతా ఊడ్చేసిన ఆ యువకుడు.. పోలీసులు ఏం చేశారంటే?

కాగా, అది బ్యాంక్ పొరపాటేనని యూఐడీఏఐ అధికారులు అంటున్నారు.

దీనిపై పోలీసు కేసు నమోదైంది. జీత్రాయ్ సామంత్‌కు నోటీసులు పంపారు.

సర్వీస్ పాయింట్ నుంచి డబ్బులు తీసే టప్పుడు అకౌంట్ హోల్డర్ పేరు వస్తుందని, కానీ, సామంత్ కావా లనే దాన్ని పట్టించు కోలేదని పోలీసులు చెప్పారు. ఆ విషయం బయట చెప్పొద్దని సర్వీస్ పాయింట్ వాడికీ కొంత డబ్బు చెల్లించాడని ఆరోపించారు. సుమారు రూ. 2 లక్షల వరకు జీత్రాయ్ సామంత్.. శ్రీమతి లాగూరి అకౌంట్ నుంచి విత్ డ్రా చేశాడు. తనకు ఆ డబ్బులు మోడీ పంపించాడని విశ్వసించినట్టు సామంత్ ఓ పోలీసు నోటీసుకు సమాధానం ఇచ్చాడు. ఆ డబ్బులు తాను విత్‌డ్రా చేసుకోగలనని బ్యాంకు మేనేజర్ చెప్పాడని వివరించాడు. తనకు తెలియకుండానే తన ఆధార్ నెంబర్ మరొక అకౌంట్‌కు లింక్ చేశారని, గత రెండేళ్లుగా తనకు ఆ విషయం కూడా అధికారులు తెలియజేయలేదని సామంత్ వాదిస్తున్నాడు. తాను లాగూరి ఖాతా నుంచి తీసుకున్న సుమారు రూ. 2 లక్షల డబ్బులు తిరిగి చెల్లించాలని పోలీసులు అడిగితే తాను చెల్లించలేనని పేర్కొన్నాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios