Asianet News TeluguAsianet News Telugu

పొరపాటున బ్యాంకు ఖాతాలోకి రూ. 4.6 కోట్లు.. అంతా ఊడ్చేసిన ఆ యువకుడు.. పోలీసులు ఏం చేశారంటే?

ఓ వ్యక్తి ఖాతాలోకి పొరపాటున రూ. 4.6 కోట్ల డబ్బు జమ అయింది. ఆ డబ్బుచూసిన యువకుడు వెంటనే బంగారం కొనేశాడు. మరిన్ని ఖరీదైన వస్తువులను కొనుగోలు చేశాడు. పోలీసులు అతడిని పట్టుకున్నారు. 18 నెలల జైలు శిక్ష పడింది.
 

australian spent 4.6 crore which was deposited accidentally
Author
First Published Dec 13, 2022, 6:06 PM IST

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తి ఖాతాలోకి ఏకంగా రూ 4.6 కోట్లు పొరపాటున వచ్చి పడ్డాయి. ఆ అమౌంట్ చూసి సదరు ఖాతాదారుడు ఎగిరి గంతేశాడు. వెంటనే వాటన్నింటినీ ఖర్చు పెట్టే పనిలో పడిపోయాడు. బంగారు బిస్కెట్లు మొదలు మేకప్, డిజైనర్ క్లాథ్స్.. ఇంకా ఎన్నో రకాల వస్తులు చకచకా కొనేశాడు. ఆ ఖాతాదారుడి పేరు అబ్దెల్ ఘాడియా. 24 ఏళ్ల యువకుడు. ర్యాపర్‌గా రాణించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అతడికి ఇప్పుడు 18 నెలల జైలు శిక్ష పడింది.

అబ్దెల్ ఘాడియా ఖాతాలోకి పొరపాటును ఆ డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసింది ఇల్లు కొనుగోలు చేద్దామనుకున్న దంపతులు. ఇన్‌స్టాగ్రామ్ న్యూటిషనిస్టు తారా థోర్న్, ఆమె భర్త కోరీ లైఫ్ సేవింగ్స్ ఆ మనీ. వారు సిడ్నీలోని ఉత్తర బీచుల్లో ఓ ఇంటిని కొనుగోలు చేయాలని కలలు గన్నారు. అందుకోసం డబ్బు కూడబెట్టి. కొనుగోలుకు అంతా ప్లాన్ చేసుకున్నారు. 

అయితే, వారు బ్రోకర్ ఆడం మాగ్రోతో డీల్ చేస్తున్నామని భావించారు. వారు ఈమెయిల్ ద్వారా కాంటాక్టులో ఉన్నారు. కానీ, ఆ బ్రోకర్ మెయిల్ ఐడీని హ్యాక్ చేసినట్టు 9నౌ రిపోర్ట్ చేసింది.

Also Read: ‘హత్యకు గురైన’ మహిళ అరెస్టు.. ఆమెను ‘చంపిన’ భర్తకు బెయిల్.. అసలేం జరిగిందంటే?

తారా, కోరీలను డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయాలని, ఘాడియా అకౌంట్ నెంబర్ ఇచ్చారు. దీంతో దంపతులు అతను బ్రోకర్ అనే అనుకుని డబ్బులు ఇచ్చిన ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఘాడియా వెంటనే ఆ డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేసేశాడు. ఈ ఘటన గతేడాది చోటుచేసుకుంది.

ఘాడియా తన ఖాతాలోకి డబ్బు జమ అయింది.. తాను ఖర్చు పెట్టింది ఒప్పుకున్నాడు. కానీ, డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయడంలో తన ప్రమేయం ఏమీ లేదని పోలీసులకు చెప్పాడు.

నిద్ర లేిచ చూసేసరికి తన ఖాతాలో డబ్బు జమై ఉన్నదని ఘాడియా పోలీసులకు తెలిపాడు. తాను ఇష్టపడ్డవారికి బంగారం ఇవ్వాలని అనుకున్నారని, అందుకే బంగారం కొనుగోలు చేసి ఇచ్చేసినట్టు డైలీ టైలిగ్రాఫ్ ఓ కథనంలో పేర్కొంది.

ఈ స్కామ్ కేసులో ఘాడియాపైనే అభియోగాలు ఉన్నాయి. ఘాడియాను ఊరికే వదిలిపెట్టేది లేదని అతడికి 18 నెలల జైలు శిక్షణు జడ్జీ వేశారు. పది నెలలపాటు పెరోల్ కూడా ఉండదని వివరించారు. పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. కానీ, ఘాడియా కొన్న బంగారాన్ని మాత్రం కనిపెట్టలేకపోయారు.

Follow Us:
Download App:
  • android
  • ios