పోలాండ్ కి చెందిన ఓ మహిళ ఇన్ స్టా గ్రాంలో పరిచయమైన తన ప్రియుడికోసం ఝార్ఖండ్ కు వచ్చేసింది. 

ఝార్ఖండ్ : ఝార్ఖండ్ లోని ఓ వ్యక్తితో పోలాండ్ లోని ఓ మహిళకు ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. దీంతో అతనితో ప్రేమలో పడిన ఆ మహిళ తన ఆరేళ్ల కూతురితో కలిసి పోలాండ్ నుంచి భారత్ కి వచ్చింది. 2021లో జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లా ఖుత్రా గ్రామానికి చెందిన మహమ్మద్ షాదాబ్ (35) కు ఇంస్టాగ్రామ్ లో పోలాండ్ కు చెందిన పోలాక్ బార్బరా (45)అనే మహిళతో పరిచయం ఏర్పడింది.

అది కాస్తా కొద్ది రోజులకు ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే, పోలాక్ కు ఇంతకుముందే పెళ్లయింది. ఇటీవలే భర్తతో ఆమె విడాకులు తీసుకుంది. ఆరేళ్ల కూతురు కూడా ఉంది. దీంతో ఇన్స్టా ప్రియుడి కోసం ఝార్ఖండ్లోని హజారిబాగ్ కు వచ్చేసింది పోలాక్. అక్కడ షాబాద్ ను కలుసుకుంది. ప్రస్తుతం ఇద్దరు కలిసే ఉంటున్నారు. 

అమానవీయ ఘటనలను ఎవరూ ఉపేక్షించరు: మణిపూర్ ఘటనపై మోడీ

జార్ఖండ్లోని ఇటీవలి ఎండలను ఆమె తట్టుకోలేకపోయింది. దీంతో షాబాద్ వెంటనే ఏసీ ఏర్పాటు చేయించాడు. భారత్ గురించి మాట్లాడుతూ పోలాక్… ‘భారత్లోని ప్రజలు చాలా ప్రేమ గలవారు. భారత్ చాలా అందమైన దేశం. నేను వచ్చిన తర్వాత నన్ను చూసేందుకు ప్రతిరోజు వందలాది మంది వస్తున్నారు’ అని సంతోషంగా చెప్పుకొచ్చింది.

అయితే, పోలాండ్ నుంచి మహిళ వచ్చి ఇక్కడ ఉంటున్న విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో దీని మీద వారు ఆరా తీశారు. హజారీబాగ్ డీఎస్పీ రాజీవ్ కుమార్ ఖుత్రా గ్రామానికి వెళ్లి వివరాలడిగారు. దీనిమీద ఆయన మాట్లాడుతూ.. ‘పోలాక్ తో నేను మాట్లాడాను. ఆమె మరి కొద్ది రోజుల్లో పోలాండ్ కు వెళ్లిపోతానని తెలిపింది. షాబాద్ కు వీసా కోసం ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పింది. అతడిని కూడా తనతో పాటు పోలాండ్ కు తీసుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తోంది’ అన్నారు.