రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ బుధవారం నాడు హోం క్వారంటైన్ కు వెళ్లారు. జేఎంఎం ఎమ్మెల్యే మధుర మహతో, మంత్రి మిథిలేష్ ఠాకూర్ లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో సీఎం స్వీయ నిర్భంధంలోకి వెళ్లాడు. ఈ విషయాన్ని సీఎం హేమంత్ సోరేన్ ట్వీట్ చేశాడు.

తన కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బందిని కూడ హోం క్వారంటైన్ కి వెళ్లాలని సీఎం సూచించారు. ముఖ్యమైన పనులను తాను ఇంటి నుండే నిర్వహించనున్నట్టుగా సీఎం ప్రకటించారు. 

also read:24 గంటల్లో 482 మంది మృతి, ఇండియాలో 7,42,417కి చేరిన కరోనా కేసులు

అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని ఆయన కోరారు. ఇంటి నుండి బయటకు వచ్చే సమయంలో ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
సీఎం నివాసానికి వెళ్లే మార్గాలను అధికారులు మూసివేశారు. 

జార్ఖండ్ రాష్ట్రంలో 2996కి కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 2104 మంది కరోనా నుండి కోలుకొన్నారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు 22 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 22,752 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒక్కరోజే 482 మంది మరణించారు.