న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంబిస్తోంది. గత 24 గంటల్లో 22,752 కేసులు నమోదయ్యాయి. 482 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో కరోనా కేసులు 7,42,417కి చేరుకొన్నాయి.కరోనాతో ఇప్పటివరకు 20,642మంది మరణించినట్టుగా కేంద్రం తెలిపింది.

అసోం రాష్ట్రంలో గత 24 గంటల్లో 814 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 13,336కి చేరుకొన్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి  హిమంతా బిశ్వ శర్మ ప్రకటించారు.

మహరాష్ట్రలోని పుణెలో గత 24 గంటల్లో 1,134  కరోనా కేసులు రికార్డయ్యాయి. అంతేకాదు 29 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. పుణెలో 30,978కి కరోనా కేసులు చేరుకొన్నాయి. ఇక్కడ ఇప్పటికే కరోనాతో 919 మంది మరణించినట్టుగా జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ భగవాన్ పవార్ ప్రకటించారు.

also read:2021 వరకు కరోనా వ్యాక్సిన్ వచ్చే ఛాన్సే లేదు: డబ్ల్యుహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్

ఈ నెల 10వ తేదీ వరకు పూర్తిగా షట్ డౌన్ విధిస్తున్నట్టుగా కటక్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రకటించింది. వీకేండ్  రోజుల్లో కూడ షట్ డౌన్ వర్తిస్తోందని కటక్ మున్సిపల్ కార్పోరేష్ స్పష్టం చేసింది.

ఒడిశా రాష్ట్రంలో 9526 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 6486 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఇప్పటికే కరోనాతో 38  మంది మరణించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1879 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏడుగురు కరోనాతో మరణించారు. రాష్ట్రంలో కరోనా కేసులు 27,612కి చేరుకొన్నాయి. ఇప్పటివరకు 16,287  మంది కరోనా నుండి కోలుకొన్నారు.కరోనాతో రాష్ట్రంలో 313 మంది మరణించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ బులెటిన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.