Asianet News TeluguAsianet News Telugu

యువతిని జుట్టు పట్టి కొట్టిన పోలీసు, సీఎం ఫైర్: సస్పెండ్ చేసిన డీజీపీ

కొందరు పోలీసులు వ్యవహరించే తీరు మొత్తం ఆ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా చేస్తోంది. జార్ఖండ్ రాష్ట్రంలో ఇదే తరహా ఘటన చోటు చేసుకొంది. ఈ విషయమై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Jharkhand CM Hemant Soren takes note of cop slapping woman, orders action
Author
Jharkhand, First Published Jul 29, 2020, 11:30 AM IST

రాంచీ: కొందరు పోలీసులు వ్యవహరించే తీరు మొత్తం ఆ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా చేస్తోంది. జార్ఖండ్ రాష్ట్రంలో ఇదే తరహా ఘటన చోటు చేసుకొంది. ఈ విషయమై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

జార్ఖండ్ రాష్ట్రంలోని సాహిబ్ గంజ్ ప్రాంతంలో ఓ పోలీసు అధికారి రోడ్డుపై వస్తున్న యువతిని చెంపపై కొట్టాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ రోడ్డుపై ఎందుకు వచ్చావని యువతిపై చెంపపై కొట్టాడు పోలీసు అధికారి. అంతేకాదు ఆమె జుట్టు పట్టుకొన్నాడు. ఈ వీడియోను చూస్తే పోలీసు అధికారి ఆ యువతి పట్ల దయ లేకుండా వ్యవహరించాడో అర్ధమౌతోంది. 

ఈ వీడియో సీఎం హేమంత్ సోరేన్ దృష్టికి  వచ్చింది.  ఈ వీడియోను చూసిన సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతిని కొట్టిన పోలీసుపై చర్యలు తీసుకోవాలని సీఎం డీజీపీని ఆదేశించారు. ఈ మేరకు ట్విట్టర్ పై ఈ వీడియోను డీజీపీకి ట్యాగ్ చేశారు. 

ఇలాంటి అనుచిత ప్రవర్తలను ఏ మాత్రం భరించరానిదని ఆయన ట్వీట్ చేశారు. ఇలా వ్యవహరించిన పోలీసును కఠినంగా శిక్షించాలని ఆయన ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు యువతిపై దాడికి పాల్పడిన పోలీసును సస్పెండ్ చేసినట్టుగా డీజీపీ ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు డీజీపీ.


 

Follow Us:
Download App:
  • android
  • ios