Asianet News TeluguAsianet News Telugu

మాజీ ప్రియురాలిపై ఇలా పగ తీర్చుకున్నాడు. చివరికీ..

తెలిసి తెలియని వయస్సులో ప్రేమ. పార్టీలు, పబ్బులు.. మోజు తీరాక బ్రేకప్..  కానీ, అప్పటివరకూ ఉన్న ప్రేమ ..  ద్వేషం, కోపంగా మారింది.  విడిపోయిన ప్రియురాలిపై ఓ ప్రేమికుడు పగ పెంచుకున్నాడు. 

jharkhand chaibasa story police sent the lover to jail for making his ex-girlfriend's objectionable video viral KRJ
Author
First Published Nov 6, 2023, 2:10 AM IST

టీనేజ్ వయస్సులోనే వాళ్లద్దరూ ప్రేమించుకున్నారు.  కలిసి చట్టాపట్టాలేసుకుని తిరిగారు. కన్నుమిన్ను తెలియకుండా షికార్లు చేశారు. కానీ, ఎక్కడో వారిద్దరికి భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో వారి బంధం బీటలు వారింది. ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుని ఒకరికొకరు దూరమయ్యారు. కానీ, ప్రియురాలిపై అప్పటివరకూ ఉన్న ప్రేమ.. ఒక్కసారిగా ద్వేషంగా మారింది. ఆమె మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని భావించాడు ఆ మాజీ ప్రియుడు.

ఎలాగైనా తన మాజీ ప్రియురాలు పరువు తీయాలనీ, ఆమె జీవితం నాశనం చేయాలని దుర్మార్గపు ఆలోచనలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో తన స్నేహితులతో కలిసి ఎలా ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ వేశాడు. అందుకోసం.. టెక్నాలజీని ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. తన ప్రియురాలి ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఒడిశాలోని చైబాసా ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని కిరిబురు చెందిన ఓ బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది.

బ్రేకప్ తర్వాత ప్రియురాలిపై  ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో  సోషల్ మీడియాలో ఓ ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేశాడు.ఆ ఎకౌంట్ నుంచి మాజీ ప్రియురాలి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు తన ప్రియురాలి ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి.. పంపడం మొదలుపెట్టాడు. షాక్ అయినా అమ్మాయి. తీవ్ర ఆందోళనకు గురైంది. కానీ వెంటనే ఈ విషయాన్ని ఫిర్యాదు చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. ఆ యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసు దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. తనని బ్లాక్ మెయిల్ చేసింది ఆమె మాజీ ప్రియుడేనని గుర్తించారు.  

ముగ్గురి అరెస్టు.. ప్రధాన నిందితుడి కోసం గాలింపులు

వీడియోను వైరల్ చేసినందుకు ఆధారాలతో ముగ్గురు నిందితులు కన్హా ముఖి (25), దినేష్ దాస్ అలియాస్ రాజు (25), శుభం ప్రసాద్ (23)లను అరెస్టు చేశారు. అరెస్టయిన యువకులంతా కిరిబూరు వాసులు. అందరిపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే ఈ ఘటనలో ప్రధాన నిందితుడు, ప్రియురాలి మాజీ ప్రియుడు మాత్రం పోలీసులకు చిక్కకుండానే ఉన్నాడు.

త్వరలోనే అతడు కూడా కటకటాలపాలవుతాడని పోలీసులు చెబుతున్నారు. అతడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సమాజంలో పరువు పోతుందనే భయంతో ఆమె ఆత్మహత్యకు కూడా పాల్పడవచ్చు. పోలీసులు బాలికపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మరియు ఆత్మహత్య వంటి తప్పుడు చర్యలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios