Asianet News TeluguAsianet News Telugu

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల: టాప్ టెన్‌లో తెలుగు విద్యార్ధుల హవా

ఎన్ఐటీలలో ప్రవేశానికి, ఐఐటీ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత పొందేందుకు నిర్వహించిన జేఈఈ మెయిన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం రాత్రి ప్రకటించింది.

jee main 2019 results released
Author
New Delhi, First Published Apr 30, 2019, 7:39 AM IST

ఎన్ఐటీలలో ప్రవేశానికి, ఐఐటీ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత పొందేందుకు నిర్వహించిన జేఈఈ మెయిన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం రాత్రి ప్రకటించింది. జేఈఈ మెయిన్ ఫలితాలతో పాటు ర్యాంకులను కూడా ఏజెన్సీ వెల్లడించింది.

ఈ ఫలితాల్లో ఢిల్లీకి చెందిన శ్రీవాత్సవ్ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకు సాధించాడు. ఇక తెలుగు విద్యార్థులు ఫలితాల్లో సత్తా చాటారు. టాప్ టెన్‌లో ముగ్గురు తెలంగాణ విద్యార్ధులు, ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్ధి ఉన్నారు.

బి. కార్తికేయకు 5వ ర్యాంకు, ఏ.సాయికిరణ్ -7, కే. విశ్వనాథ్‌కు 8వ ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్ ఫలితాల్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా అభ్యర్థులను జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు ఎంపిక చేస్తారు.

మే 3వ తేదీ నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అడ్వాన్స్‌డ్ ఫలితాల అనంతరం జేఈఈ మెయిన్ 2019 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios