అమిత్ షాతో కుమారస్వామి భేటీ: బీజేపీ-జేడీఎస్ పొత్తుపై చర్చ
జేడీఎస్ నేత కుమారస్వామి, శుక్రవారం నాడు కేంద్ర మంత్రి అమిత్ షాతో ఇవాళ భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ:జేడీఎస్ నేత కుమారస్వామి కేంద్ర అమిత్ షాతో శుక్రవారంనాడు భేటీ అయ్యారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జేడీఎస్, బీజేపీ కలిసి పనిచేసే విషయమై అమిత్ షాతో చర్చిస్తున్నారు.కేంద్ర మంత్రి అమిత్ షాతో చర్చించేందుకు కుమారస్వామి నిన్ననే బెంగుళూరు నుండి న్యూఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో కుమారస్వామి చర్చించనున్నారు. అమిత్ షా, జేపీ నడ్డా తదితరులతో చర్చించనున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని 28 లోక్ సభ స్థానాలున్నాయి.ఈ 28 ఎంపీ స్థానాల్లో ఎన్ని స్థానాల్లో ఏ ఏ పార్టీ పోటీ చేయాలనే విషయమై చర్చించనున్నారు. అయితే గతంలో ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సీట్ల పంపకంపై చర్చించనున్నారు.బీజేపీ పొత్తు విషయమై ప్రధాని నరేంద్ర మోడీతో మాజీ ప్రధాని దేవేగౌడ చర్చించనున్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. దీంతో కర్ణాటక నుండి వచ్చే ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను దక్కించుకొనేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తుంది.ఈ క్రమంలోనే జేడీఎస్ తో ఆ పార్టీ పొత్తు పెట్టుకోవాలని భావిస్తుంది.ఈ నెల మొదట్లోనే ఈ రెండు పార్టీల మధ్య పొత్తుపై బీజేపీ నేత, మాజీ సీఎం యడియూరప్ప ప్రకటన చేశారు.