తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో అపోలో ఆస్పత్రి శనివారంనాడు ఐదు పేజీల అఫిడవిట్ ను అరుముఘస్వామి విచారణ సంఘానికి సమర్పించింది. సీసీటీవీలను ఎందుకు ఆఫ్ చేశామనే విషయంపై వివరణ ఇచ్చింది.

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో అపోలో ఆస్పత్రి శనివారంనాడు ఐదు పేజీల అఫిడవిట్ ను అరుముఘస్వామి విచారణ సంఘానికి సమర్పించింది. సీసీటీవీలను ఎందుకు ఆఫ్ చేశామనే విషయంపై వివరణ ఇచ్చింది. తన గదిలోంచి జయలలితను బయటి నుంచి తెచ్చేప్పుడు సీసీటీవీ ఫుటేజీలను ఆఫ్ చేయాలని తమను కోరినట్లు అందులో తెలిపారు.

జయలలితను తీసుకుని వచ్చే మార్గంలో సీసీటీవీలను ఆఫ్ చేయాలని నిఘా విభాగం ఐజి కెనఅ సత్తియమార్తితో పాటు నలుగురు పోలీసులు అధికారులు తమను కోరారని, ఆమె గదిలోకి చేరుకోగానే తిరిగి సీసీటీవీలను ఆన్ చేశామని అపోలో యాజమాన్యం వివరణ ఇచ్చింది.

2016 చివరలో జయలలితను ఆస్పత్రిలో చేర్చే సమయంలో సీసీటీవీలు పనిచేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు సంబంధించి అపోలో ఆస్పత్రికి చెందిన వైద్యులను పలువురిని విచారించారు. 

జయలలిత 2016 డిసెంబర్ 5వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 75 రోజుల పాటు ఆమెకు అపోలో ఆస్పత్రిలో చికిత్స అందించారు.