అఫైర్ అనుమానం: ప్రైవేట్ పార్ట్స్ కు షాక్ పెట్టి భార్యను చంపేసిన జవాను

Jawan kills wife by electrocuting her private parts
Highlights

ఛత్తీస్ గడ్ సాయుధ బలగాల జవాను భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ కు కరెంట్ షాక్ పెట్టి ఆమెను చంపేశాడు.

రాయపూర్: ఛత్తీస్ గడ్ సాయుధ బలగాల జవాను భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ కు కరెంట్ షాక్ పెట్టి ఆమెను చంపేశాడు. అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతోస బలోడాబజార్ - భటపర జిల్లాలో అతను ఆ దారుణానికి ఒడిగట్టాడు.

నిందితుడిని సురేష్ మిరి (33)ని ముంగేలి జిల్లా సార్గావ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య లక్ష్మి (27)ని చంపి శవాన్ని అతను ఇక్కడికే తెచ్చినట్లు పోలీసులు చెప్పారు.

దంతెవాడ సిఎఎఫ్ 6వ బెటాలియన్ లో వంటమనిషిగా పనిచేస్తున్న మిరి విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు.

సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి - బాత్రూంలో లక్ష్మి దుస్తులు ఉతుకుతోంది. ఆ సమయంలో మిరి లోనికి వెళ్లి ఆమెను కొట్టడం ప్రారంభించాడు. స్పృహ తప్పి పడిపోగానే లైవ్ వైర్ సాయంతో ఆమె ప్రైవేట్ పార్ట్స్ కు కరెంట్ షాక్ పెట్టాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. 

తన భార్య ఆరోగ్యం బాగా లేదని అత్తింటివారికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత ఓ వ్యాన్ ను కిరాయికి తీసుకుని ఆమె శవాన్ని తన స్వస్థలం ముంగేలి జిల్లా ఖాజ్రీ గ్రామానికి తీసుకుని వెళ్లాడు. 

తన భార్య అనారోగ్యంతో మరణించిందని అత్తింటివారికి చెప్పాడు. శవాన్ని చూసిన తర్వాత అత్తింటివారు అతనితో గొడవ పడి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని మిరిని అదుపులోకి తీసుకున్నాడు. నేరం జరిగిన నిందితుడి ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. 

loader