నన్నూ, నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు : అధికార పార్టీ ఎమ్మెల్యే

First Published 20, Jul 2018, 6:38 PM IST
Jarkhnad bjp mla anand kumar ojha fears about his security
Highlights

తనకూ, తన కుటుంబానికి రక్షణ కరువైందంటూ ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే  అసెంబ్లీ సాక్షిగా మొరపెట్టుకున్న సంఘటన జార్ఖండ్ లో చోటుచేసుకుంది. తనను చంపేస్తామంటూ కొందరు బెదిరింపులకు దిగుతున్నట్లు ఓ బిజెపి ఎమ్మెల్యే అసెంబ్లీలో తన ఆవేధనను వ్యక్తం చేశాడు. వారి నుండి తనకు ప్రాణహాని ఉందని, కాపాడాలంటూ స్పీకర్ ను వేడుకున్నాడు.

జార్ఖండ్ లోని రాజ్ మహల్ నియోజకవర్గం నుండి బిజెపి ఎమ్మెల్యేగా అనంత్ కుమార్ ఓఝా కొనసాగుతున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా తననూ, తన కుటుంబాన్ని చంపేస్తామంటూ కొందరు బెదిరిస్తున్నారని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. ఫోన్ చేసి అసభ్యంగా దూషించడంతో పాటు నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయాడు.   
 
అయితే ఎమ్మెల్యే రక్షణపై స్పీకర్ దినేశ్ స్పందిస్తూ... సీఎం రఘువర్‌దాస్ ఈ విషయాన్ని నోట్ చేసుకున్నారని, తప్పకుండా మీకు రక్షణ కల్పిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అలాగే బెదిరింపులకు దిగిన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకుంటారని అన్నారు.  
 
loader