India Japan summit: జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా భారత్ లో పర్యటించనున్నారు. ఇరుదేశాల మధ్య శిఖరాగ్ర సమావేశాలు జరుగనున్న క్రమంలో ఈ నెల 19, 20 తేదీలలో భారత్ లో పర్యాటించనున్నారు.
India Japan summit: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం కొనసాగుతున్న నేపథ్యంలో జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా, భారత ప్రధాని మోడీ కీలక సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య శిఖరాగ్ర సదస్సు నేటీ నుంచి ప్రారంభం కానున్నది. ఇందులో భాగంగా.. జపాన్ ప్రధాని భారత్ కు రానున్నారు. మార్చి 19,20 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. శనివారం శిఖరాగ్ర చర్చలు జరుపనున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, ఇండో-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం సహకారం గురించి ఇద్దరు నేతలు మాట్లాడతారని భావిస్తున్నారు. 14వ ఇండియా-జపాన్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా జపాన్ ప్రధాని రెండు రోజుల పాటు భారతదేశంలో అధికారంగా పర్యటించనున్నారు.
జపాన్ ప్రధాని పర్యటన గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. భారత్-జపాన్ ల శిఖరాగ్ర సమావేశం మార్చి 19,20 న జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు.. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా భారత్ కు వస్తున్నారు. 14వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం లో భాగంగా మార్చి 19 నుంచి మార్చి 20 వరకు న్యూఢిల్లీలో అధికారిక పర్యటించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించేందుకు, మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ సదస్సు ఇరు పక్షాలకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు.
ఇండో పసిఫిక్ శాంతి సుస్థిరత, శ్రేయస్సు కోసం భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, విభిన్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించడానికి, బలోపేతం చేయడానికి, పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఇరుపక్షాలకు అవకాశాన్ని అందిస్తుందని బాగ్చి చెప్పాడు. ఇరువురు నేతల మధ్య ఇదే తొలి భేటీ కావడం విశేషం. మునుపటి శిఖరాగ్ర సమావేశం అక్టోబర్ 2018లో టోక్యోలో జరిగింది. 2019లో సవరించిన పౌరసత్వ చట్టంపై అస్సాం రాజధానిలో నిరసనలు వెల్లువెత్తున్నాయి. దీంతో అప్పటి జపాన్ ప్రధాని కౌంటర్ షింజో అబే మధ్య వార్షిక శిఖరాగ్ర సమావేశం రద్దు చేయబడింది. COVID-19 మహమ్మారి కారణంగా 2020లో అలాగే 2021లో సమ్మిట్‌ను నిర్వహించడం సాధ్యం కాలేదు. ఈ ఏడాది సమావేశానికి భారత్ అతిధ్యం ఇస్తుంది.
