Today Top Stories: రైతుబంధుపై కీలక ప్రకటన.. సంక్రాంతి సెలవులు పొడిగింపు.. కోడికత్తి కేసులో ట్విస్ట్..

Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో  రైతుబంధుపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన.. ఎమ్మెల్సీ కవితకు షాకిచ్చిన సైబర్ నేరగాళ్లు..  సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ..  సంక్రాంతి సెలవులు పొడిగింపు..,ప్రధాని మోడీ అయోధ్య పర్యటనలో మార్పులు..?, ఉత్కంఠ పోరు.. ఆప్తాన్ పై భారత్ గెలుపు వంటి పలు వార్తల సమాహారం

January 18th 2024 Today Top Stories, Top 10 Telugu News, Andhra pradesh, Telangana Headlines KRJ   

Today Top Stories:  రైతుబంధుపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన.. 

Rythu Bandhu: తెలంగాణలో కొత్తగా అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల అమలులో కీలకంగా వ్యవహరిస్తోంది. తాజాగా రైతు బంధు నిధుల విషయమై కూడా శుభవార్త చెప్పింది. ఎన్ని ఇబ్బందులు తలెత్తిన రైతు డిక్లరేషన్ ను అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. నిజామాబాద్ లోని నందిపేట లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుబంధుపై కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా రైతులందరి ఖాతాల్లో రైతుబంధు మొత్తాలను జమ చేస్తామని, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.   

ఎమ్మెల్సీ కవితకు షాకిచ్చిన సైబర్ నేరగాళ్లు.. 

 బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సైబర్ కేటుగాళ్లు షాకిచ్చారు.  ఆమె సోషల్‌ మీడియా అకౌంట్స్ (ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌(ట్విట్టర్‌))‌హ్యాక్‌ చేశారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పలుసార్లు హ్యాకింగ్‌కు యత్నించారనీ, అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి దుండగులు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి తనకు  సంబంధంలేని పలు వీడియోను పోస్ట్‌ చేశారని తెలిపారు. ఈ చర్యను గమనించిన తాను వెంటనే తన అకౌంట్ హ్యాకింగ్ అయ్యినట్టు గుర్తించానని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ..పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ( @TelanganaDGP @cyberabadpolice @TSCSB) ట్యాగ్ చేశారు. సోషల్ మీడియా ఖాతాలను పూర్తి స్థాయిలో తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. 

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై సస్పెన్స్.. తమిళిసై కీలక నిర్ణయం!

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉన్నది. హైకోర్టులో ఇందుకు సంబంధించి పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్యలు తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గతంతో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ క్యాబినెట్ దాసోజు శ్రవణ్, సత్యనారాయణల పేర్లను సిఫారసు చేసింది. వీరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాల్సిందని సూచించింది. కానీ, గవర్నర్ తమిళిసై ఆ ప్రతిపాదనను పెండింగ్‌లో ఉంచారు. ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడానికి వారిద్దరికీ తగిన అర్హతలు లేవని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు.

 
 సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. అందులో సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు. సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రంగంపై ఆధారపడ్డ 20 వేల మంది కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 సంక్రాంతి సెలవులు పొడిగింపు..  

Sankranthi Holidays: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులను పొడిగింది. అదనంగా మరో మూడు రోజులను సెలవులుగా పేర్కొంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ఈ నెల 22వ తేదీన పున:ప్రారంభం కానున్నాయి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ మేరకు విజ్ఞప్తులు చేశారని, వారి వినతులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

కోడికత్తి కేసులో ట్విస్ట్ ... జైల్లో శ్రీను నిరాహార దీక్ష

కోడి కత్తి కేసులో ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో హత్యాయత్నానికి పాల్పడిన జనిపల్లి శ్రీనివాస్ నిరాహార దీక్షకు దిగాడు. జగన్ పై కోడి కత్తితో దాడికి దిగిన శ్రీనివాస్ గత ఐదేళ్లుగా రిమాండ్ ఖైధీగా వున్నాడు. అయితే జగన్ కోర్టులో వాంగ్మూలం ఇస్తే శ్రీనుకు బెయిల్ వచ్చే అవకావాలున్నాయి... కానీ ఆయన కోర్టుకు హాజరుకాకుండా జాప్యం చేస్తున్నారు. దీంతో విశాఖ సెంట్రల్ జైల్లో శ్రీను, విజయవాడలో అతడి తల్లి నిరాహార దీక్షకు దిగారు. 2019 ఎన్నికల సమయంలో విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేతగా వున్న జగన్ పై కోడికత్తితో హత్యాయత్నం జరిగింది. కోడికత్తిలో జగన్ పై దాడికి దిగాడు శ్రీనివాస్.  దీంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న విమానాశ్రయ భద్రతా సిబ్బంది స్థానిక పోలీసులకు అప్పగించారు. అప్పటినుండి హత్యాయత్నం కేసులో రిమాండ్ ఖైధీగా జైల్లోనే మగ్గుతున్నాడు శ్రీను. 

IndiGo:  ఇండిగోకు రూ.1.20 కోట్ల జరిమానా.. ఎందుకంటే?


IndiGo: ఇండిగో సంస్థపై డీజీసీఏ ఫైర్ అయ్యింది. ఫ్లైట్ లేట్ అవ్వడంతో కొంతమంది ప్రయాణికులు ముంబై విమానాశ్రయంలో రన్‌వే దగ్గర కూర్చొని భోజనం చేశారు. ఇప్పుడు ఈ ఘటన వైరల్ గా మారడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బిసిఎఎస్) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇండిగో రూ.1.2 కోట్లు, ముంబై ఎయిర్‌పోర్టు రూ.90 లక్షలు జరిమానా విధించింది.  


Ayodhya: అయోధ్యలో రామ్ లల్లా ఆలయ నిర్మాణం పూర్తి 
 
Ayodhya: అయోధ్య రామ మందిరంలో ఈ నెల 22వ తేదీన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది. విపక్షాలు ఈ కార్యక్రమానికి డుమ్మా కొడుతూ కీలక ఆరోపణలు చేస్తున్నాయి. నిర్మాణం పూర్తికాని ఆలయంలో ప్రాణ ప్రతిష్ట చేయడం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నాయి. ఈ కార్యక్రమం ఎన్నికల ప్రయోజనాల కోసం కాకుంటే.. ఇప్పుడు ఎందుకు అని నిలదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా బుధవారం కీలక వివరణ ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే రామ మందిరం పూర్తయిందని మిశ్రా అన్నారు.
 

 ప్రధాని మోడీ అయోధ్య పర్యటనలో మార్పులు..?

జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామ్ లల్లాకు శంకుస్థాపన చేసే రోజు కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ప్రధాని మోడీ అయోధ్య పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.  మహా సంప్రోక్షణ (ప్రాణ ప్రతిష్ట) కార్యక్రమానికి ఒకరోజు ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యకు చేరుకుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. పొగమంచు కారణంగా విమానాలు ఆలస్యమయ్యే పరిస్ధితిని దృష్టిలో వుంచుకుని మోడీ షెడ్యూల్‌లో ఈ మార్పులు జరిగినట్లుగా తెలుస్తోంది.  

IND vs AFG: నరాలు తెగే ఉత్కంఠ.. డబుల్ సూపర్ ఓవర్‌లో టీమిండియా విక్టరీ..  

IND vs AFG: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య సిరీస్‌లో చివరి టీ20 మ్యాచ్‌లో ఇరు జట్టు హోరాహోరీగా పోరాడాయి. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల సోర్కులు సమానం కావడంతో సూపర్ ఓవర్ కు వెళ్లింది. సూపర్ ఓవర్ లో కూడా ఇరు జట్ల స్కోర్లు సమానం కావడంతో క్రికెట్ చరిత్రతో తొలిసారి ఓ మ్యాచ్ లో రెండు సార్లు సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. ఇలా ఈ నరాలు తెగే ఉత్కంఠ మధ్య రెండో సూపర్ ఓవర్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం  సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగి చివరి మ్యాచ్‌లో భారత్ చరిత్రాత్మక విజయం సాధించింది. దీంతో 3-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. 

ధోని రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శ‌ర్మ‌..

Team India: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సూపర్‌ ఓవర్‌లో అఫ్ఘాన్‌ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. ఈ విజ‌యంతో టీమ్ఇండియా ఓ అరుదైన రికార్డును నెల‌కొల్పింది. టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు ప్ర‌త్య‌ర్ది జట్లల‌ను వైట్‌వాష్ లు చేసిన జ‌ట్టుగా టీమిండియా స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. అఫ్గానిస్తాన్‌తో సిరీస్ క‌లిపి 9 సార్లు ప్ర‌త్యర్థుల‌ను వైట్‌వాష్ చేసింది భారత్ జట్టు. ఈ క్ర‌మంలో పాకిస్తాన్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టింది. దైపాక్షిక సిరీసుల్లో పాకిస్తాన్ 8 సార్లు ప్ర‌త్య‌ర్థి జట్టు‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios