జమ్ము కశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా చర్యల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న సీఆర్‌ఫిఎఫ్ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది మృతిచెందారు. మరో ఎనిమిది మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఎన్కౌంటర్ గురించి భద్రతా అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  కమ్ము కశ్మీర్ కుప్వారా జిల్లాలో భద్రతా విధుల్లో వున్న సీఆర్‌ఫిఎఫ్ జవాన్ల మృదంపై ఉగ్రమూకలు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగేలోపు విద్వంసం సృష్టించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు ఇద్దరు ఆర్మీ జవాన్లు, మరో ఇద్దరు స్థానిక పోలీసులు మృతిచెందారు. అంతేకాకుండా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందిన వారిలో సీఆర్‌ఫిఎఫ్ కు చెందిన ఓ ఉన్నతాధికారి కూడా వున్నట్లు సమాచారం. 

ఉగ్రవాదుల దాడిలో అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులకు దిగి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సమాచారం. అంతేకాకుండా ఉగ్రవాద స్థావరాన్ని చుట్టుముట్టి కాల్పులు జరుపుతున్నారు. ఇంకా భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. 

కాల్పుల్లో గాయపడిన జవాన్లను ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే కాల్పుల్లో చనిపోయిన జవాన్ల మృతదేహాలను కూడా ఆస్పత్రికి తరలించారు.