జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ బస్సు అదుపుతప్పి బాగా లోతుగా వున్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయానిస్తున్న దాదాపు 12 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇంకా చాలా మంది ప్రయానికులు తీవ్ర గాయాలపాలయ్యారు.

బనిహాల్ నుండి రందాన్‌కు ప్రయాణిస్తున్న బస్సు ఇవాళ ఉదయం లోయలో పడటంతో ప్రమాదం జరిగింది. బస్సు దాదాపు 200 మీటర్ల లోయలో పడటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రమాదం చీనాబ్ నదీ ఒడ్డున గల ఘాటు రోడ్డుపై జరిగింది. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, సథినికులు. భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బైటకు తీయడంతో పాటు క్షతగాత్రులను కాపాడి ఆస్పత్రికి తరలిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Scroll to load tweet…