బుఖారీలా చంపుతాం.. కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడికి పాక్ నుంచి బెదిరింపులు

jammu kashmir bjp President ravinder Raina receiving threatening calls from pakistan
Highlights

బుఖారీలా చంపుతాం.. కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడికి పాక్ నుంచి బెదిరింపులు

కశ్మీర్‌కు చెందిన జర్నలిస్టు బుఖారీని చంపినట్లుగానే.. నిన్ను కూడా చంపేస్తామంటూ జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనాకు పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ విషయంపై ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.. అనంతరం రవీందర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఒక పిరికిపందల దేశమని.. గత కొద్దిరోజులుగా లాహోర్, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్ తదితర పాక్ నగరాల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తనను చంపేస్తానంటూ ఫోన్లు చేస్తున్నారని.. ఇవాళ యోగా డేలో పాల్గొన్న తర్వాత కూడా కరాచీ నుంచి బెదిరింపు ఫోన్లు వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.. తాను పాక్ వ్యతిరేక నినాదాలు చేస్తున్నప్పటి నుంచి వారు తనను టార్గెట్ చేశారని.. తనకు ప్రాణహానీ ఉందంటూ రవీందర్ ఆందోళన వ్యక్తం చేశారు.. 
 

loader