జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సుధీర్ఘ కర్ఫ్యూను ఎత్తివేసిన నాటి నుంచి వారాల వ్యవధిలో రెండోసారి గ్రేనేడ్ దాడితో విరుచుకుపడ్డాయి. శ్రీనగర్‌లోని మౌలానా ఆజాద్ రోడ్‌లోని మార్కెట్‌ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం ముష్కరులు గ్రేనేడ్‌ను విసిరారు.

ఆ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. గత నెల 28న సోపోర్‌లోని ఓ బస్టాండ్ సమీపంలో ఉగ్రవాదులు గ్రేనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 19 మంది గాయపడిన సంగతి తెలిసిందే.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత యూరోపియన్ యూనియన్‌కు సంబంధించిన ఎంపీల బృందం కాశ్మీర్‌ పర్యటనకు ముందు బీభత్సం సృష్టించేందుకు తీవ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డామి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రశిబిరాలను భారత్ ధ్వంసం చేస్తుండటంతో ఉగ్రవాదులు కాశ్మీర్‌లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని సైన్యం పేర్కొంది.   

కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు కూలీలు మరణించిన సంగతి తెలిసిందే. ఐదుగురు కూలీలు కూడా స్థానికులు కారు. వారు పశ్చిమ బెంగాల్ కు చెందినవారిగా తెలుస్తోంది.

ఉగ్రవాదుల దాడిలో ఓ కూలీ గాయపడినట్లుగా కూడా తెలుస్తోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గత రెండు రోజుల్లో ఇది ఆరో ఉగ్రవాద దాడి. దక్షిణ కాశ్మీర్ ను ఉగ్రవాదులు లక్ష్యం చేసుకున్నట్లు భావిస్తున్నారు. కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

Also Read:జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి: ఐదుగురు కూలీల మృతి

సంఘటన జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు దిగ్బంధం చేశాయని, పెద్ద యెత్తున గాలింపు చర్యలు చేపట్టాయని, అదనపు బలగాలు అక్కడికి చేరుకుంటున్నాయని జమ్మూ కాశ్మీర్ పోలీసు వర్గాలు ఎఎన్ఐతో చెప్పారు. 

యూరోపియన్ యూనియన్ కు చెందిన 23 మంది పార్లమెంట్ సభ్యులు జమ్మూ కాశ్మీరులో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. జమ్మూ కాశ్మీరుకు ప్రత్యేక హోదాను గ్యారంటీ చేసిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత పరిస్థితులను పరిశీలించడానికి వారు పర్యటన చేస్తున్నారు.

ఉగ్రవాదులు సోమవారంనాడు అనంతనాగ్ జిల్లాలో ఓ ట్రక్ డ్రైవర్ ను కాల్చి చంపారు. ఆ ట్రక్ డ్రైవర్ ను జమ్మూలోని కాత్రాకు చెందిన నారాయణ్ దత్ గా గుర్తించారు.

Also Read:ఉగ్రవాదుల టార్గెట్ ...ప్రధాని మోదీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ

దేశ ప్రధాని నరేంద్రమోదీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉగ్రముప్పు పొంచి ఉంది. ఈ విషయాన్ని ఇంటిలిజెన్స్ అధికారులు ధ్రువీకరించారు. బంగ్లాదేశ్ తో అరుణ్ జైట్లీ మైదానంలో జరిగే తొలి టీ20లో టీమిండియా క్రికెటర్లకు భద్రతను పెంచాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు అందినట్లు సమాచారం.

కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా భారత క్రికెటర్లందరకీ ఉగ్రముప్పు ఉందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కి ఓ ఆకాశ రామన్నఉత్తరం అందింది. దానవలో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, హోంశాఖ మంత్రి అమిత్ షా ,  నిర్మలా సీతారామన్, రాజ్ నాథ్ సింగ్,  బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ పేర్లు కూడా ఈ లేఖలో ఉండటం గమనార్హం.