జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదుల హతం

jammu and kashmir encounter
Highlights

జమ్మూ కాశ్మీర్ భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇవాళ ఉదయం ఉగ్రవాదుల స్థావరంపై పక్కా సమాచారంతో దాడి చేసిన సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. 
 
జమ్మూ కాశ్మీర్ భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇవాళ ఉదయం ఉగ్రవాదుల స్థావరంపై పక్కా సమాచారంతో దాడి చేసిన సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. 

వివరాల్లోకి వెళితే... కేంద్ర ప్రభుత్వం రంజాన్ తర్వాత కాల్పుల విరమణను ఉపహరించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుండి సైన్యం ఉగ్రమూకలపై ఉక్కుపాదం మోపుతోంది. అంతేకాకుండా ఉగ్రవాద కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచింది.

ఇవాళ అనంత్ నాగ్  వద్ద ఉగ్రవాదుల సంచారంపై సమాచారం అందండంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఆ జిల్లాను జల్లెడ పట్టిన సైన్యం ఇద్దరు టెర్రరిస్టులను మట్టుపెట్టారు. అయితే ఇంకా ఉగ్రవాదులను ఏరివేయడానికి ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. 

ఈ కాల్పుల్లో మఈతిచెందిన ఉగ్రవాదుల వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే వారి వద్ద లభించిన ఆయుధాలు, పేలుడు సామాగ్రి గురించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు. 
 
loader