Asianet News TeluguAsianet News Telugu

జ‌మ్మూకాశ్మీర్ లో సైన్యం-ఉగ్రవాదులకు మ‌ధ్య కొన‌సాగుతున్న ఎదురుకాల్పులు.. ఒకరు మృతి

Rajouri: జ‌మ్మూకాశ్మీర్ లోని కుల్గాంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. దక్షిణ కశ్మీర్ లోని కుల్గాం జిల్లాలోని హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ప్ర‌స్తుతం రాజౌరి ప్రాంతంలో ఉగ్ర‌వాదుల‌కు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు కొన‌సాగుతున్నాయ‌ని సంబంధిత అధికార వ‌ర్గాలు తెలిపాయి. 
 

Jammu and Kashmir: Encounter between security forces, terrorists continue, Rajouri RMA
Author
First Published Aug 6, 2023, 9:47 AM IST

Encounter between security forces, terrorists: జ‌మ్మూకాశ్మీర్ లోని కుల్గాంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. దక్షిణ కశ్మీర్ లోని కుల్గాం జిల్లాలోని హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ప్ర‌స్తుతం రాజౌరి ప్రాంతంలో ఉగ్ర‌వాదుల‌కు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు కొన‌సాగుతున్నాయ‌ని సంబంధిత అధికార వ‌ర్గాలు తెలిపాయి.

వివ‌రాల్లోకెళ్తే.. జ‌మ్మూకాశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలోని ఓ గ్రామంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పులు ఆదివారం రెండో రోజుకు చేరుకున్నాయి. బుధల్ ప్రాంతంలోని గుండా-ఖావాస్ గ్రామంలో పోలీసులు, సైన్యం చేపట్టిన కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో భద్రతా దళాలతో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యాడు. చివరి రిపోర్టులు వచ్చినప్పుడు ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఉగ్రవాదులకు తప్పించుకునే అన్ని మార్గాలను భద్రతా దళాలు మూసివేశాయనీ, వారిని మట్టుబెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై పోలీసులకు సమాచారం అందడంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఒక చిన్న పోలీసు బృందం ఆపరేషన్ ప్రారంభించిందనీ, ఆ త‌ర్వాత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) బలగాలతో కలిసి సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగిస్తున్న‌ద‌ని పేర్కొన్నారు.  ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుండి హతమైన ఉగ్రవాది మృతదేహాన్ని ఇంకా వెలికి తీయలేదని అధికారి తెలిపారు.

ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి దూరంగా ఉండాలని రాజౌరీ పోలీసులు ఆదివారం ప్ర‌జ‌ల‌కు హెచ్చరికలు జారీ చేశారు. ప్ర‌జ‌లంద‌రికీ సమాచారం అందింద‌నీ, ఖవాస్ లోని గుండా గ్రామ సాధారణ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయ‌ని తెలిపారు. ప్రజలు ఈ ప్రాంతాన్ని సందర్శించవద్దనీ, ఆ ప్రాంతం వెలుపల కనీసం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండాలని అధికారులు సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios