కరోనా ఎఫెక్ట్: అమర్‌నాథ్ యాత్ర రద్దు... అంతలోనే నిర్ణయం వెనక్కి
కరోనా కారణంగా దేశంలోని అన్ని రంగాలపైనా ప్రభావం పడినట్లుగానే ఆధ్యాత్మిక రంగంపైనా పడింది. ఈ నేపథ్యలో కరోనా కారణంగా అమర్‌నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఆ వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
కరోనా కారణంగా దేశంలోని అన్ని రంగాలపైనా ప్రభావం పడినట్లుగానే ఆధ్యాత్మిక రంగంపైనా పడింది. ఈ నేపథ్యలో కరోనా కారణంగా అమర్‌నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఆ వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కరోనా కారణంగా ఈ ఏడాది జూన్ 23 నుంచి ప్రారంభం కావాల్సిన అమర్‌నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
Also Read:మరోసారి సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ మర్ము నేతృత్వంలో జరిగిన శ్రీ అమర్‌నాథ్‌జీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో తొలుత పేర్కొన్నారు. ప్రథమ పూజ, సంపన్న పూజలను యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసి వెంటనే దానిని ఉప సంహకరించుకున్నారు.
దక్షిణ కాశ్మీర్‌లోని హిమాలయాల్లోని అమర్‌నాథుడిని దర్శనార్ధం ఏటా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. మొత్తం 42 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఈ ఏడాది జూన్ 23 నుంచి ఆగస్టు 3 వరకు జరగాల్సి ఉంది.
Also Read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఉత్తర్‌ప్రదేశ్‌లో పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకొన్న జంట
కాశ్మీర్‌లో తీవ్ర ఉగ్రవాద ముప్పు ఉన్న సమయంలోనూ ఈ యాత్ర జరగడం గమనార్హం. మరోవైపు భారత్‌లో బుధవారం నాటికి కరోనా సోకిన వారి సంఖ్య 20 వేలు దాటింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల దేశంలో 20,471 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
వీరిలో 3,960 మంది డిశ్చార్జి కాగా.. 652 మంది మృత్యువాత పడ్డారు. దేశంలోనే అత్యథికంగా ఆ రాష్ట్రంలో 5,221 మందికి కరోనా సోకగా, 251 మరణాలు నమోదయ్యాయి. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారవిలో కొత్తగా మరో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ముంబై మున్సిపల్ కార్పోరేషన్ వెల్లడించింది.