వివాదాస్పద ఎన్ఆర్‌సీ, సీఏఏ బిల్లులపై ఢిల్లీలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా వర్సిటీకి చెందిన విద్యార్ధులు నిరసన ర్యాలీ నిర్వహించారు.

జామియా వర్సిటీ నుంచి విద్యార్ధులు ర్యాలీగా పార్లమెంట్‌కు బయల్దేరారు. అయితే వీరిని ఓక్లా ఆసుపత్రి వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు వ్యతిరేకంగా విద్యార్ధులు నినాదాలు చేశారు, బారికేడ్ల నుంచి దూకే ప్రయత్నం చేశారు.

Also Read:ఫేస్ బుక్ లైవ్ మూమెంట్స్: జామియా షూటర్ రామభక్త్ గోపాల్

వర్సిటీలోనే ఆందోళన నిర్వహించాలని, పార్లమెంట్ వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదని విద్యార్ధులకు చెప్పడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయినప్పటికీ విద్యార్ధులు ముందుకు చొచ్చుకు రావడంతో పోలీసులు టీయర్ గ్యాస్‌ను ప్రయోగించారు. 

కొద్దిరోజుల క్రితం పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం నిరసన వ్యక్తం చేస్తున్నవారిపై దుండగుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అతను పిస్టల్ బయటకు తీయడానికి కొద్ది నిమిషాల ముందు ఫేస్ బుక్ లో లైవ్ ఇచ్చాడు. షూటర్ సెల్ఫీ ఫుటేజీని ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు.

Also Read:జామీయ యూనివర్శిటీలో కాల్పుల కలకలం: విద్యార్ధికి గాయాలు

తనను తాను అతను రామభక్త్ గోపాల్ గా చెప్పుకున్నాడు. నల్లటి స్లీవ్ లెస్ బాంబర్ జాకెట్ తొడుక్కుని అతను నిరసన వేదిక వద్ద తచ్చాడడం కూడా కనిపించింది. తన లక్ష్యాన్ని నిర్ణయించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అతను కనిపించాడు. 

ఏహ్ లో ఆజాదీ (ఇక్కడ మీ స్వేచ్ఛ ఉంది) అంటూ గోపాల్ అరవడం వినిపించింది. అతను జరిపిన కాల్పుల్లో షాదాబా్ ఫరూఖ్ అనే విద్యార్థి గాయపడ్డాడు. ఎడమ చేతికి గాయమై రక్తమోడుతున్న విద్యార్థిని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు తరలించినప్పటికీ సంఘటనా స్థలంలో కేకలు మిన్నుముట్టాయి.