రాజకీయం అంటే ఏంటో నా పుస్తకం చెబుతుంది: జైపాల్ రెడ్డి

First Published 7, Aug 2018, 6:31 PM IST
jaipal reddy explanation against his book ten ideologies
Highlights

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి రచించిన ‘‘ టెన్ ఐడియాలజీస్’’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఈ పుస్తకం వ్రాయడానికి ప్రేరేపించిన కారణాలపై జైపాల్ రెడ్డి వివరించారు. 

రాజకీయానికి ప్రాతిపదిక భావజాలమని...ఎలాంటి రాజకీయమైనా భావజాలం నుంచే పుడుతుందని ఆయన తెలిపారు. తాను యూత్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు.. విద్యార్థి నేతగా ఉన్నప్పుడు కమ్యూనిస్టులతో తలపడే వాళ్లమని.. వాళ్లు మార్క్స్  అంటే.. తాము పండిట్ నెహ్రూ అని తగాదా పడే వాళ్లమని జైపాల్ వివరించారు. ప్రస్తుతం భావజాలాల మీద చర్చ లేదని.. భావజాలరాహిత్యంపై హీనత్వాన్ని చూసి తట్టుకోలేక మూలాల మీదకు వెళ్లి ఈ పుస్తకం రాశానని వెల్లడించారు..

60 ఏళ్ల వృద్ధులకైనా, 20 ఏళ్ల యువకుడికైనా రాజకీయాల గురించి సరైన సమాచారాన్ని ఈ పుస్తకం అందిస్తుందని జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సోషలీజం, మార్క్సిజం ఇలా అన్ని రకాల భావజాలాలను ఒకే చోట చేర్చాలనే తపనకు ప్రతిరూపం ఈ పుస్తకమన్నారు.

loader