బాల్యవివాహం నేరం కింద జైలుకు.. బెయిల్ పై వచ్చి మైనర్ భార్యపై అత్యాచారం.. మళ్లీ అరెస్ట్..
మైనర్ అయిన భార్యమీద అత్యాచారం చేసిన నేరానికి ఓ వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. అంతకుముందు అతను బాల్యవివాహం కేసులో అరెస్టై కొద్దిరోజుల క్రితమే బెయిల్ మీద బైటికి వచ్చాడు.

డెహ్రాడూన్ : కూతురిని బాల్య వివాహం జరిపించిన కేసులో.. 15 ఏళ్ల బాలిక తండ్రి, ఆమెను పెళ్లి చేసుకున్న 38 ఏళ్ల 'భర్త' గత ఏడాది పితోర్‌గఢ్‌లో అరెస్ట్ చేశారు. బాధితురాలు, 9వ తరగతి చదువుకుంటోంది. ఆమెను తండ్రి బలవంతంగా తనకంటే వయసులో 23యేళ్లు పెద్దవాడైన వ్యక్తితో వివాహం జరిపించాడు.
ఈ విషయం తెలియడంతో బాలిక టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాల్య వివాహాల నిషేధ చట్టం కింద నిరుడు వారిని అరెస్ట్ చేశారు. ఐదు నెలల క్రితం నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. బెయిల్ మీద బైటికి వచ్చిన బాలిక భర్త ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఘోర రోడ్డు ప్రమాదం.. కారు-ట్రక్కు ఢీ.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి..
మైనర్ బాలిక ఈ విషయాన్ని పోలీసులకు తెలిపింది. శనివారం అత్యాచారం ఆరోపణలపై అతడిని తిరిగి అరెస్టు చేశారు.బాలిక జరిగిన విషయాన్ని చెబుతూ.. భర్త తనను షాపింగ్ పేరుతో మభ్యపెట్టి రప్పించాడని, ఆ తరువాత తన గదికి తీసుకువెళ్లాడని చెప్పింది. అక్కడ తన మీద బలవంతం చేశాడని.. అతడినుంచి ఎలాగే తప్పించుకోగలిగానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
తన తండ్రిని బెయిల్‌పై విడుదల చేయడంలో సహకరించనని.. బెదిరిస్తూ తనపై దాడికి పాల్పడ్డాడని ఆమె తెలిపింది. బాధితురాలికి
చైల్డ్ హెల్ప్‌లైన్ కౌన్సెలింగ్ చేస్తోందని, ప్రస్తుతం ఆమె తల్లి వద్దే ఉంటోందని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ చంచల్ శర్మ తెలిపారు. నిందితుడు, బాధితురాలి తండ్రి కూలీలు అని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.
అత్యాచారం మీద ఫిర్యాదు చేయడంలో బాలిక తన టీచర్ సహాయం తీసుకుంది. అంతకుముందు బాల్య వివాహం కేసులో సహకరించి టీచరే తను. దీనిమీద ఎస్ హెచ్ఓ మాట్లాడుతూ... "అమ్మాయికి నిరుడు ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది. బాధితురాలు ఇప్పటికీ మైనర్.. ఆమె వయసు 16 సంవత్సరాలే.. నేరాన్ని స్వయంగా తెలిపింది. దీనివల్ల నిందితులపై ఐపీసీ,పోక్సో చట్టంలోని సెక్షన్ 376 (రేప్) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం" అని అన్నారు.