Asianet News TeluguAsianet News Telugu

సినీనటి సహాయకుడికి జాక్ పాట్.. లాటరీలో పదికోట్లు వరించింది.. ఎక్కడంటే...

కేరళకు చెందిన ఓ సినీ నటి దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి లాటరీలో పదికోట్లు వచ్చాయి. దీంతో అతను ఇప్పుడు కోటీశ్వరుడిగా మారిపోయాడు. 

Jackpot for the film actress assistant, in ten crore in the lottery, kerala - bsb
Author
First Published Mar 21, 2023, 8:38 AM IST

ఎర్నాకులం : కేరళ రాష్ట్ర సమ్మర్ బంపర్ లాటరీలో అస్సాంకు చెందిన వ్యక్తి రూ.10 కోట్ల మొదటి బహుమతిని గెలుచుకున్నాడు. సినీ నటి రజనీ చాందీ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆల్బర్ట్ టిగాను అదృష్ట దేవత వరించింది. ఎస్ బిఐ అలువా బ్రాంచ్‌లో బహుమతి గెలుచుకున్న టికెట్ ను అతను సమర్పించబడింది.

నటి రజనీ చాందీ భర్త చాందీ వచ్చి బహుమతి గెలుచుకున్న టిక్కెట్‌ను ఆల్బర్ట్ బ్యాంక్ మేనేజర్ గీవర్గీస్ పీటర్‌కు అందజేశారు. ఆల్బర్ట్ 1995లో పని వెతుక్కుంటూ అసోం నుంచి కేరళకు వచ్చాడు. అతనికి లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే SE 222282 టిక్కెట్‌ కొన్నాడు. అయితే, ఈ సారి ఈ టికెట్ అతనికి అదృష్టాన్ని తీసుకొచ్చింది. ‘సమ్మర్ బంపర్ బీఆర్ 90లాటరీ’ విడుదల చేసిన ఫలితాల్లో మొదటి బహుమతి 10 కోట్లు బంపర్ లాటరీ తగిలింది.

కేరళ రాష్ట్ర లాటరీ విభాగం నిన్న సమ్మర్ బంపర్ బీఆర్ 90 ఫలితాన్ని ప్రకటించింది. తిరువనంతపురంలోని గోర్కీ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ డ్రా జరిగింది. మొదటి బహుమతి పది కోట్లు. రెండవ బహుమతి టికెట్ నంబర్ ఎస్ బి 152330కి లభించింది. ఎర్నాకులంలో విక్రయించిన టిక్కెట్‌లకు మొదటి బహుమతి, రెండవ బహుమతి లభించాయి.

రెండో బహుమతి రూ.50 లక్షలు. మూడో బహుమతి ఐదు లక్షలు. నాల్గవ బహుమతి విజేతకు లక్ష రూపాయలు కూడా అందుతాయి. ఐదవ బహుమతి ఐదు వేల రూపాయలు. ఆరో బహుమతి రూ.2,000. ఏడో బహుమతి రూ.1,000. ఎనిమిదో బహుమతికి రూ.500 కూడా లభిస్తుంది. టికెట్ ధర 250 రూపాయలు. 

కేరళలో వలస కార్మికుడికి రూ. 75 లక్షల లాటరీ.. వెంటనే పోలీసు స్టేషన్‌కు పరుగుతీశాడు.. ఎందుకో తెలుసా?

ఈ టికెట్ కు సంబంధించిన అన్ని క్రైం ప్రాసెస్ లను అల్బర్ట్ పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత టికెట్ ను కొచ్చిలోని ఓ బ్యాంకులో వేశాడు. తన టికెట్ ను ఎవరైనా కాజేస్తారనే భయంతో అతను ఇంట్లోనుంచి బయటకు రావడం లేదట. 

ఇదిలా ఉండగా, ఫిబ్రవరిలో లాటరీ లో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్ బాల్ లాటరీ గేమ్ లో కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 2.04 బిలియన్ డాలర్లు గెల్చుకున్నాడు. అంటే, మన కరెన్సీలో పదహారున్నరవేల కోట్ల రూపాయలు. అయితే, మొదట అతనికి సంబంధించిన వివరాలు బయటపెట్టని.. లాటరీ అధికారులు.. ఎట్టకేలకూ అతని వివరాలు బయటపెట్టారు. అతని పేరు ఎడ్విన్ కాస్ట్రో అని చెప్పారు. కానీ మిగతా వివరాలేవీ చెప్పలేదు అధికారులు. గత నవంబర్ లో పవర్ బాల్ జాక్ పాట్ అతడిని వరించింది. దీంతో కనీవినా ఎరుగని లాటరీ ప్రైజ్ మనీ అతడిని వరించింది. 

విజేతల వివరాలను కాలిఫోర్నియా చట్టాల ప్రకారం.. బయటికి చెప్పొచ్చు. కానీ, కొన్ని కండిషన్లు ఉంటాయి. పేరు, ఆ టికెట్ కొన్న ప్లేస్ చెప్పొచ్చు.. కానీ టికెట్ ఏ రోజు కొన్నది, ఏ రోజు ఫ్రైజ్ మనీ గెల్చుకున్నది.. ఎంత మొత్తం గెల్చుకున్నది లాంటి వివరాలు కూడా చెప్పొచ్చు. కానీ.. అతనికి సంబంధించిన పర్సనల్ విషయాలు అంటే.. అడ్రస్, నేపథ్యం వివరాలు మాత్రం చెప్పడానికి వీలులేదు.

ప్రైజ్ మనీ అనౌన్స్ అయ్యాక.. వెంటనే తీసుకోవాల్సిన పనిలేదు. యేడాదిలోపు ప్రైజ్ మనీ తీసుకోవచ్చు. లేదంటే వదిలేయచ్చు. అయితే, కాస్ట్రో అందుకు ఇష్టపడలేదట. ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా తీసుకుంటాడో లేదో తెలియదు. అయితే, తనకు జాక్ పాక్ కొట్టిన సంగతి తెలియగానే భావోద్వేగానికి గురయ్యానని.. అసలు నాకే వచ్చిందా.. నిజమేనా అని షాక్ అయ్యానని ఒక ప్రకటనలో క్యాస్ట్రో తెలిపాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios