Asianet News TeluguAsianet News Telugu

ఆరేళ్లుగా ప్రియుడితో డేటింగ్.. కొంత కాలం త‌రువాత అత‌డు సోద‌రుడు అవుతాడ‌ని తెలియ‌డంతో..

ఆ మహిళ తన ప్రియుడితో ఆరేళ్లుగా సహజీవనం చేస్తోంది. అయితే కొంత కాలం తరువాత వారిద్దరు డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్నారు. ఈ ఫలితాల్లో ఆమెకు అతడు సోదరుడు అవుతాడని తేలింది. 

Dating a boyfriend for six years.. knowing that after some time he will become a brother..
Author
First Published Sep 1, 2022, 1:29 PM IST

ఈ వార్త‌ను జీర్ణం చేసుకోవ‌డం కొంచెం క‌ష్టంగా ఉండ‌వ‌చ్చు. ఇబ్బందిక‌రంగా కూడా అనిపించ‌వ‌చ్చు. ఓ మ‌హిళ ఆరేళ్లుగా ఓ వ్య‌క్తితో డేటింగ్ చేస్తోంది. అయితే కొంత కాలం త‌రువాత అత‌డు త‌న‌కు బ‌యోలాజిక‌ల్ గా సోద‌రుడు అవుతాడ‌ని తెలుసుకుంది. ఆమె షాక్ కు గుర‌య్యింది. ఈ విష‌యాన్ని ఆ మ‌హిళ సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌పంచానికి వెల్ల‌డించింది.

పీయూష్ గోయల్ ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలకు ప్రధాని మోదీ.. గణేషుడికి హారతి.. వీడియో..

పేరు తెలియ‌జేయ‌ని ఓ అనామ‌క మ‌హిళ సోష‌ల్ మీడియా ప్లాట్ ఫారం ‘రెడ్డిట్’ లో ఓ సుదీర్ఘ పోస్ట్ లో దీనిని తెలియజేసింది. డీఎన్ఏ టెస్ట్ ఫ‌లితాల్లో త‌న జీవిత భాగ‌స్వామి త‌న‌కేం అవుతార‌నే నిజాన్ని తెలుసుకున్న‌ట్టు పేర్కొన్నారు. త‌న జీవ‌త భాగ‌స్వామిని ఒక‌రు ద‌త్త‌త తీసుకున్నార‌ని, తాము డేటింగ్ ప్రారంభించ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో ఇది ఒక‌ట‌ని ఆమె తెలిపారు.

అయితే తమ పూర్వీకులు ఎవ‌రు అని తెలుసుకోవ‌డానికి డీఎన్ఏ పరీక్ష నిర్వ‌హించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని అన్నారు. ‘‘డీఎన్ఏ పరీక్ష చేయించుకున్నాం. వాటిని చూసేందుకు నేనెంతో ఉత్సాహంగా వెళ్లాను. కానీ ఫలితాలు చూసిన వెంటనే నేను షాక్ అయ్యాను. అందులో తాము తోబుట్టువులమని నాకు తెలిసింది. ఈ విష‌యం నాకు ఇప్పుడే తెలిసింది. నేను ఇంకా నా భాయ్ ఫ్రెండ్ ను క‌ల‌వలేదు. ఈ విష‌యం ఇంకా అత‌డికి చెప్ప‌లేదు ’’ అని ఆమె పేర్కొన్నారు. 

‘‘ ఈ విషయం నన్ను భయపెడుతోంది. నేను ఏమి చేయాలో నాకు అర్థం కావడం లేదు. నేను ఇప్పటికీ నా ప్రియుడు / సోదరుడిని ప్రేమిస్తున్నాను.  మేము 6 సంవత్సరాలుగా కలిసే ఉన్నాము. మాకు ఒక ఇళ్లు ఉంది. మేము సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభ‌విస్తున్నాం. ఈ పరీక్ష తప్పు కావాల‌ని నేను కోరుకుంటున్నాను. మ‌ళ్లీ ఇంకో సారి ప‌రీక్ష చేసుకుంటాం. కానీ నాకు భ‌యంగా ఉంది. నేను ఇప్ప‌టికీ అత‌డిని నా జీవ‌త భాగ‌స్వామిగానే భావిస్తున్నాను’’ అని ఆమె పేర్కొంది. 

పెళ్లాం ఊరెళితే.. ట్రాన్స్ జెండర్ ని ఇంటికి ఆహ్వానించి, హత్య చేసి..సగం పెట్టెలో పెట్టి...

‘‘ మా మధ్య రిలేషన్ షిప్ ఇప్పటికీ బాగుంది. మేము ఒకరినొకరు చాలా వేగంగా అర్థం చేసుకున్నాం. మేము ఒక‌రినొక‌రు త్వ‌ర‌గా ఇష్ట‌ప‌డ్డాం. అంత‌కు ముందు నేనెప్పుడు ఎవ‌రినీ క‌లిసిన ఇలాంటి ఫీలింగ్ క‌లుగ‌లేదు. అత‌డిని చూడ‌గానే అంత‌కు ముందే ప‌రిచయం ఉన్న‌ట్టు, అత‌డి వైపు ఆక‌ర్శితం అయ్యాను.  మేము అంద‌రి సాధార‌ణ జంట‌ల మాదిరిగానే ఉన్నాం ’’ అని ఆమె రెడ్డిట్ పోస్ట్ లో తెలిపారు. 

అయితే ఈ పోస్ట్ వేలాది మంది లైక్ చేశారు. ఈ పోస్ట్ చేసిన వారు అనేక మంది విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ఆ పోస్ట్ కు వివిధ ర‌కాలుగా కామెంట్స్ వ‌స్తున్నాయి. రెడ్డిట్ లో ఈ పోస్ట్ వైర‌ల్ గా మారింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios