Asianet News TeluguAsianet News Telugu

మొఘలులే భార‌త‌దేశానికి ‘హిందుస్తాన్’ రూపాన్ని తీసుకొచ్చారు - కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖ‌లిక్

మొఘలులే భారతదేశాన్ని ఏకం చేశారని, వారి చర్యల వల్లే దేశం ‘హిందుస్థాన్’ అనే రూపాన్ని సంతరించుకుందని అస్సాం రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖ‌లిక్ అన్నారు. మొఘలులను చూసి తాను గర్వపడుతున్నానని చెప్పారు.  

It was the Mughals who brought the form of 'Hindustan' to India - Congress MP Abdul Khaliq
Author
First Published Aug 30, 2022, 5:25 PM IST

భారతదేశాన్ని ఏకం చేసింది మొఘలులేనని, చిన్న చిన్న రాజ్యాలుగా విభజించ‌బ‌డి ఉన్న భారత్ వారి చ‌ర్య‌ల వ‌ల్ల ఆధునిక రూపమైన ‘హిందూస్థాన్’గా మారిందని కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖ‌లిక్ అన్నారు. అయితే తాను ఏ విధంగానూ మొఘల్ లేదా వారసుడిని కాదని స్పష్టం చేశారు.

సిసోడియా నిజాయితీ దేశం మొత్తం నిరూప‌ణ అయ్యింది - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

అస్సాంలోని బార్పేట నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖలిక్ మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు. ‘‘ చిన్న (రాచరిక) రాష్ట్రాలుగా విభజించబడిన భారతదేశానికి హిందుస్తాన్ రూపం వచ్చింది. కాబట్టి నేను మొఘలులను చూసి గర్వపడుతున్నాను. కానీ నేను మొఘలుని కాదు. వారి వారసుడిని కాదు. వారు దేశానికి ఒక ఆకారాన్ని ఇచ్చారు. దీనికి హిందుస్తాన్ అనే పేరు వచ్చింది. కాబట్టి నేను వారిని చూసి గర్వపడుతున్నాను. ’’ అని ఆయన తెలిపారు. 

కాగా.. అబ్దుల్ ఖలిక్ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై కూడా సోమవారం దాడి చేశారు. ‘‘ మా సీఎంకు మొఘల్‌లంటే ఎలర్జీ ఉంది. అయితే ఆయ‌న కూడా మొఘల్ కాలం నుంచి ఢిల్లీయే దేశానికి రాజ‌ధాని అని పేర్కొన్నారు. అయితే ఆయ‌న దీనిని బహిరంగంగా వ్యక్తం చేయడం కొంచెం ఇబ్బందిగా అనుకున్న‌ప్ప‌టికీ అదైతే వాస్త‌వ‌మే. ’’ అని ఆయన అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగిని స్తంభానికి కట్టేసిన రైతులు.. ఎరువులు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని మండిపాటు

భారతదేశంలో ఎర్రకోట, తాజ్ మహల్ వంటి స్మారక చిహ్నాలను మొఘలులు నిర్మించారని ఎంపీ అబ్దుల్ ఖ‌లిక్ అన్నారు. అందువల్ల దేశానికి వారి సహకారాన్ని విస్మరించలేమని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతీ ప్రధానమంత్రి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేస్తున్నారని అన్నారు. మొఘలులను అంతగా ద్వేషిస్తే ఎర్రకోటపై నుంచి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం సరైంది కాద‌ని చెప్పారు.

శరద్ పవార్ వేలు పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చానన్న మోడీ.. ఎన్సీపీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు

కాగా.. మొఘలుల కాలం నుంచి ఢిల్లీ భారత రాజధానిగా ఉందని అర‌వింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూ ఇటీవ‌ల అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ ట్విట్ట‌ర్ లో పోస్ట్ లు చేశారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖ‌లిక్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios