మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం నాడు రాజ్ ఘాట్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానిమంత్రి మోడీ తదితరులు నివాళులర్పించారు.

న్యూఢిల్లీ: Mahatma Gandhi వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం నాడు రాజ్‌ఘాట్ లో గాంధీ సమాధి వద్ద రాష్ట్రపతి Ramnath Kovind, ప్రదాని Nrendra Modi సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

Raj ghat లో జాతిపిత గాంధీ సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత గాంధీ గురించి మోడీ గుర్తు చేసుకొన్నారు. గాంధీ ఆశయాలను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి సమిష్టి ప్రయత్నం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. గాంధీ మహోన్నతమైన ఆశయాలను మరింతగా ప్రచారం చేయడమే తమ సమిష్టి ప్రయత్నమన్నారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతిని ధైర్యంగా కాపాడిన మహానీయులందరికీ ఆయన నివాళులర్పించారు.

కేంద్ర మంత్రి Amit Shah కూడా బాపుఘాట్ వద్ద నివాళులర్పించారు. ప్రతి భారతీయుడి హృదయంలో స్వదేశీ, స్వభాష, స్వరాజ్ స్పూర్తిని గాంధీ నిలిపారన్నారు. గాందీ ఆలోచనలు, ఆదర్శాలు దేశానికి సేవ చేసేందుకు ప్రతి భారతీయుడికి ఎల్లప్పుడూ స్పూర్తిని కల్గిస్తాయని అమిత్ షా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.