ఆ ప్రభుత్వ ఇంజనీర్ ఆస్తుల విలువ రూ.200 కోట్లు..!!

IT Raids on Noida Authority engineer house
Highlights

ఆ ప్రభుత్వ ఇంజనీర్ ఆస్తుల విలువ రూ.200 కోట్లు..!!

నోయిడాలోని ఒక ప్రభుత్వ ఇంజనీర్ అక్రమాస్తుల చిట్టా చూసి ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోరెళ్లబెట్టారు. అక్రమాస్తుల కేసులో సంబంధం ఉందని భావిస్తున్న నోయిడా అథారిటీ ప్రాజెక్ట్ ఇంజనీర్‌ బ్రిజ్‌పాల్ సింగ్‌కు చెందిన బంగ్లాతో పాటు.. ఆయన సమీప బంధువుల ఇళ్లపై ఐటీశాఖ అధికారులు ఏకాకాలంలో దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా లగ్జరీకార్లు, నగదు, నగలు, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.  వీటన్నింటి విలువ వందల కోట్ల పై మాటేనని అంచనా వేశారు. ఈ బంగ్లాలో పదుల సంఖ్యలో లగ్జరీ కార్లు.. వాటికి ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లను కనుగోన్నారు.. వీటిలో మెర్సిడెజ్ బెంజ్, టోయాటా ఫార్ట్యూన్, ఆడీతో పాటు విదేశాలకు చెందిన విలాసవంతమైన కార్లు ఉన్నాయి.

బ్రిజ్ పాల్ సింగ్ దగ్గరి బంధువుల ఇళ్లలో జరిగిన తనిఖీల్లో .. సెక్టార్ 110లోని బేంకేట్ హాల్, సెక్టార్ 33లోని మూడంతస్తుల భవనం, సెక్టార్ 52లోని ఇల్లు, సెక్టార్ 66లోని ప్లాట్, మోడీ నగర్‌లోని వ్యవసాయ క్షేత్రం, పిల్‌కువాలోని పబ్లిక్ స్కూల్, ఫరీదాబాద్ సెక్టార్ 91లోని బంగ్లా, బులంద్ షహార్‌లో పటు ప్లాట్లు ఈయన పేరు మీద ఉన్నట్టు గుర్తించారు. అంతేకాకుండా తన దగ్గరి బంధువులకు అక్రమ మార్గంలో నోయిడా అథారిటీలో ఉద్యోగాలు పొందేందుకు బ్రిజ్ పాల్ సహకరించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇతని అవినీతి ఆరోపణలు తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బ్రిజ్ పాల్‌ను సస్పెండ్  చేస్తున్నట్లు ప్రకటించారు. ఇతనిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

loader