Asianet News TeluguAsianet News Telugu

ఇక టెలికాం లైసెన్స్ పరిధిలోకి వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్.. త్వరలోనే పార్లమెంట్‌లో బిల్లు

సోషల్ మీడియా దిగ్గజ సంస్థలైన వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి యాప్స్‌ని భారతదేశంలో టెలికాం సర్వీసెస్ లైసెన్స్ యాక్ట్ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా టెలికాం బిల్ 2022 డ్రాఫ్ట్‌ని కేంద్రం ఐటీ, టెలికమ్యూనికేషన్స్ శాఖ మంత్రి విడుదల చేశారు. 

IT minister Ashwini Vaishnaw releases draft version of Telecom Bill 2022
Author
First Published Sep 23, 2022, 7:38 PM IST

టెలికాం బిల్ 2022ను కేంద్రం త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. టెలికాం లైసెన్స్ పరిధిలోకి వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇతర యాప్స్‌‌లను తీసుకురావాలని భావించింది. ఈ మేరకు టెలికాం డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది. సోషల్ మీడియా దిగ్గజ సంస్థలైన వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి యాప్స్‌ని భారతదేశంలో టెలికాం సర్వీసెస్ లైసెన్స్ యాక్ట్ పరిధిలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. సోషల్ మీడియా సంస్థలన్ని టెలికాం , లైసెన్స్ పరిధిలోకి వస్తే వినియోగదారులు అడిగినప్పుడు వారి యూజర్ల గుర్తింపును అందించడంతో పాటు అనేక రకాల బాధ్యతల్ని ఈ కంపెనీలు పాటించాల్సి వుంటుంది. 

అయితే దీనిపై ప్రజలు, సంస్థలు తమ అభిప్రాయాలను చెప్పుకునేందుకు అక్టోబర్ 20 వరకు సమయం ఇచ్చారు. ఒకవేళ టెలికాం బిల్స్ చట్టంగా మారితే.. వాట్సాప్ , ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సంస్థలు తమ యూజర్ల గుర్తింపును వెరిఫై చేయాల్సి వుంటుంది. అయితే ఇప్పటి వరకు ప్రైవసీ, వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఇటువంటి చర్యలు పట్టించుకోలేదు. మరోవైపు కేంద్రం తెస్తున్న ఈ తాజా బిల్లుతో సోషల్ మీడియా సంస్థల నుంచి నిరసనలు వచ్చే అవకాశం వుంది. ఈ డ్రాఫ్ట్ ప్రకారం.. ఆయా సోషల్ మీడియా సంస్థల ఫ్లాట్ ఫాం నుంచి ఎవరికైనా మెసేజ్ పంపితే ఆ మెసేజ్ పంపిన ఐడెంటీటీ, మెసేజ్ స్వీకరించిన వారికి అందుబాటులో వుండాల్సి వుంటుంది. అలాగే ప్రభుత్వ సంస్థలు, దర్యాప్తు సంస్థలు ఎప్పుడైనా సరే వీటి వివరాలు తీసుకోవచ్చు. ప

Follow Us:
Download App:
  • android
  • ios