Asianet News TeluguAsianet News Telugu

అది గ‌ట్టిగా మాట్లాడే పార్టీ- ఆప్ పై కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్రధాన్ వ్యంగ్యాస్త్రాలు

గుజరాత్ లో బీజేపీ నిర్వహిస్తున్న ‘గుజరాత్ గౌరవ్ యాత్ర’లో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొని ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు చేశారు. అది గట్టిగా మాట్లాడే పార్టీని అని అన్నారు. 

It is a loud party- Union Minister Dharmendra Pradhan jokes on AAP
Author
First Published Oct 13, 2022, 11:44 AM IST

ఈ ఏడాది చివ‌రిలో ఎన్నికల నేప‌థ్యంలో బీజేపీ చేప‌ట్టిన ‘గుజరాత్ గౌరవ్ యాత్ర’లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. విమ‌ర్శ‌లు గుప్పించారు. గుజ‌రాత్ రాష్ట్ర ప్ర‌న‌జ‌లు మ‌రో సారి తమ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశౄరు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బిగ్గరగా మాట్లాడే ప్రజల పార్టీ అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఉత్తరాఖండ్ లో షూటౌట్‌.. బీజేపీ నాయకుడి భార్య మృతి.. యూపీ పోలీసులపై హత్య కేసు..

‘‘ గుజరాత్ గౌరవ్ యాత్రలో పాల్గొనడానికి నేను ఈ రోజు మీ ముందుకు వ‌చ్చాను. ఈ సారి రాష్ట్ర ప్రజలు మ‌ళ్లీ మాపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారని మాకు నమ్మకం ఉంది. ‘‘ వారిది గట్టిగా అరిచే వ్యక్తుల సమూహం (ఆప్)... వారి ఢిల్లీ మోడల్ అంటే ఏమిటి? వారు నిజాయితీగా ఉంటే మిమ్మల్ని (మీడియా) ఢిల్లీకి తీసుకెళ్లాలి. అక్కడ అన్నీ చూపించాలి. ఏ బాధ్యతా లేని వ్యక్తులను చూసి నేను భయపడుతున్నాను. అది అలాంటి  వ్యక్తులు ఉన్న గ్రూపు. ’’ అని ప్రధాన్ అన్నారు.

ఉద్ధవ్ ఠాక్రే నా సేనాపతి.. శివ‌సేనకు ఎప్పటికీ ద్రోహం చేయను- ఎంపీ సంజ‌య్ రౌత్.. త‌ల్లికి భావోద్వేగ లేఖ

కాగా.. ఈ గుజరాత్ గౌరవ్ యాత్రను మెహసానా జిల్లాలోని బెచర్జీ పట్టణంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆ పట్ట‌ణంలో జ‌రిగిన స‌భ‌లో న‌డ్డా మాట్లాడుతూ.. ‘‘ ఇది గుజరాత్ గౌరవ్ యాత్ర మాత్రమే కాదు, భారతదేశానికే గర్వ కారణంగా నిలుస్తున్నది. నరేంద్ర మోడీ నాయకత్వంలోప్రపంచ పటంలో దేశాన్ని తిరిగి స్థాపించడానికే  ఈ గౌరవ్ యాత్ర. ’’ అని తెలిపారు.

ఇది క్రియాశీలక, బాధ్యతాయుతమైన ప్రభుత్వమని, ప్రజల దుస్థితిని బీజేపీ ప్రభుత్వం అర్థం చేసుకుందని జేపీ నడ్డా అన్నారు. ‘‘ కొన్నేళ్లుగా కాంగ్రెస్ ఏం చేసింది? పార్టీలోనే ఒకరినొకరు ఎదిరి౦చుకునేవారు అని తెలిపారు. ఒక‌రికి వ్యతిరేక౦గా ప్రాంతంలో మ‌రొక‌రు నీటిని స‌ర‌ఫ‌రా చేయ‌లేదని చెప్పారు. దీంతో అవ‌స‌రం ఉన్న చోట నీరు రాలేదని ఆరోపించారు. ‘‘ జో వికాస్ కి యత్ర చలాని థీ ఉస్కో అత్కయా, భట్కాయ, లట్కాయ.’’ అని అన్నారు. ఇప్పుడు వాళ్ళే ఇరుక్కుపోయారు ఎద్దేవా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios