Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు : ఆప్ సీఎం అభ్యర్ధిగా ఇసుధన్ గధ్వీ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన సీఎం అభ్యర్ధిగా ఇసుధన్ గధ్వీని ప్రకటించింది. ఈ మేరకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన చేశారు. 

Isudan Gadhvi is AAP's CM candidate for Gujarat polls
Author
First Published Nov 4, 2022, 2:38 PM IST

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన సీఎం అభ్యర్ధిగా ఇసుధన్ గధ్వీని ప్రకటించింది. ఈ మేరకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన చేశారు. 

ఇకపోతే... గుజరాత్ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన వెంటనే కేజ్రీవాల్ ఈ ప్ర‌క‌ట‌న చేశారు. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి గురువారం నాడు ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌కారం.. డిసెంబరు 1న ఎన్నికల ఓటింగ్ జరగాల్సి ఉండగా, డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం రెండు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది.

ALso REad:గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఆప్ దే విజ‌యం.. ఓటువేస్తే ఆయోధ్య‌కు తీసుకెళ్తాం: అర‌వింద్ కేజ్రీవాల్

ఈ క్ర‌మంలోనే అర‌వింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో ప్రేమతో ఒక సందేశం అని గుజరాతీలో ఒక వీడియో సందేశాన్ని పంచుకున్నారు. "నేను మీ కుటుంబంలో సభ్యుడిని. మీ సోదరుడిని. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి.. నేను మీకు పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తాను.  మీకు ఉచిత విద్యుత్  అందిస్తాను. మిమ్మల్ని అయోధ్యలోని రామాలయానికి తీసుకెళ్తాను" అని కేజ్రీవాల్ ఆ వీడియో సందేశంలో పేర్కొన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజార‌త్ లో బీజేపీకి కంచుకోట‌గా ఉంది. దాదాపు 20 ఏండ్ల నుంచి బీజేపీ పాల‌న కొన‌సాగుతోందిత‌. ఇప్పుడు ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ బీజేపీ కంచుకోట‌ను ఢీకొట్టాల‌ని చూస్తున్నారు.

ఇప్ప‌టికే ముమ్మ‌రంగా ప్ర‌చారం సాగిస్తున్న ఆప్... అధికార‌పార్టీపై విమ‌ర్శ‌ల దాడిని కొన‌సాగిస్తూ ప్ర‌జ‌ల్లోకి వెళ్తోంది. తాజాగా అక్టోబరు 30న మోర్బీ వంతేన కూలిన ఘ‌ట‌న‌లో 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోయార‌ని మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే, ఇదే విష‌యాన్ని ఆప్ లేవ‌నెత్తుతూ మోర్బీ చోటుచేసుకున్న భారీ అవినీతి వెలుగులోకి వచ్చిందని ఆప్ విమ‌ర్శ‌లు గుప్పించింది.  రాష్ట్రంలోని 182 సీట్ల‌లో ప్ర‌స్తుతం పోలింగ్ జ‌రిగితే తాము 90-95 సీట్ల‌వ‌ర‌కు గెలుచుకుంటామ‌నీ, ఇలాంటి ప‌రిస్థితులు మ‌రికొన్ని రోజులు కొన‌సాగితే 140-150 సీట్లు తాము గెలుగుచుకుంటామ‌ని ఆప్ ప్రధాన అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. కాగా, ఆప్ ఈసారి మొత్తం 182 నియోజకవర్గాలకు అభ్యర్థులను పోటీకి దింపుతోంది. 2017లో గుజార‌త్ లోని దాదాపు 30 స్థానాల్లో పోటీ చేసినా ఎలాంటి ప్రభావం చూపలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios