Asianet News TeluguAsianet News Telugu

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీసీ-48

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీసీ-48 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. 

isro successfully lifts pslvc-48
Author
Sriharikota, First Published Dec 11, 2019, 4:27 PM IST

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీసీ-48 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది.

బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 3.26 నిమిషాలకు ఈ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో భారతదేశానికి చెందిన రీశాట్ 2బీఆర్1తో పాటు విదేశాలకు చెందిన మరో 9 ఉపగ్రహాలను ఇస్రో కక్షలో ప్రవేశపెట్టింది. ఇస్రో చరిత్రలో పీఎస్ఎల్వీ వాహక నౌకకు ఇది 50వ ప్రయోగం. 

Also Read:గోద్రా అల్లర్ల వెనుక కుట్ర లేదు: మోడీకి నావావతి కమిషన్ క్లీన్ చీట్

పీఎస్ఎల్వీసీ-48 విజయవంతం కావడం పట్ల ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె.శివన్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సందర్భంగా పీఎస్ఎల్వీసీ-50 పేరుతో రూపొందించిన పుస్తకాన్ని శివన్ విడుదల చేశారు. 

ఈ ప్రయోగం వాణిజ్య పరంగా ఇస్రోకు 319వది. ఇప్పటి వరకు ఇస్రోకు అతిపెద్ద ఖాతాదారు అమెరికానే... ఆ దేశానికి చెందిన సుమారు 233 చిన్న ఉపగ్రహాలను రోదసిలోకి చేర్చారు. పీఎస్ఎల్వీ రాకెట్‌ను తొలిసారిగా సెప్టెంబర్ 20, 1993లో ప్రయోగించారు. తొలి ప్రయత్నంలో అది విఫలమైంది.

Also Read:యువతిపై అత్యాచారం.. గర్భం దాల్చడంతో... కిరోసిన్ పోసి...

అయినప్పటికీ వెనకడుగు వేయకుండా దాదాపు 36 ప్రయోగాలను ఇస్రో విజయవంతంగా చేపట్టింది. ఆ తర్వాత 2017లో సీ-39 ప్రయోగం విఫలమైంది. ఇక ఈ ప్రయోగాలన్నింటిలోకి అత్యంత ప్రతిష్టాత్మకమైనది పీఎస్ఎల్వీ సీ-37. ఇందులో ఒకేసారి 104 ఉపగ్రహాలను రోదసిలోకి చేర్చి.. ఈ ఘనతను సాధించిన ఏకైక సంస్థగా ఇస్రో రికార్డుల్లోకి ఎక్కింది. 

Follow Us:
Download App:
  • android
  • ios