Asianet News TeluguAsianet News Telugu

ఇస్రో చైర్మన్ సోమనాథ్‌కి ప్రతిష్టాత్మక అవార్డు

ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్‌కి ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ (ఐఏఎఫ్) ప్రతిష్టాత్మక వరల్డ్ స్పేస్ అవార్డును ప్రదానం చేసింది. చంద్రయాన్-3 సాధించిన విజయానికి గాను ఇస్రోకి ఈ అవార్డు దక్కింది.

ISRO Chairman S Somanath Receives Prestigious IAF World Space Award GVR
Author
First Published Oct 14, 2024, 6:47 PM IST | Last Updated Oct 14, 2024, 6:47 PM IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రోకి మరో ఘనత దక్కింది. చంద్రయాన్- 3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ (ఐఏఎఫ్) ప్రతిష్టాత్మకంగా అందించే వరల్డ్ స్పేస్ అవార్డును ఇస్రో దక్కించుకుంది. ఈ అవార్డును ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అందుకున్నారు. ఇటలీలోని మిలాన్‌లో ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది.

ఈ సందర్భంగా ఇస్రో తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘చంద్రయాన్ -3 అసాధారణ విజయానికి గాను ప్రతిష్ఠాత్మక ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉంది. అంతరిక్ష పరిశోధనలకు భారతదేశం చేసిన కృషికి ఈ గుర్తింపు గుర్తుగా నిలుస్తుంది. కొత్త సరిహద్దుల కోసం కృషి చేస్తూనే ఉంటాం’ అనే పేర్కొంది. 

 

కాగా, చంద్రుని కూర్పు, ఖగోళంలోని రహస్యాలను వేగంగా వెలికితీయడంతో చంద్రయాన్ 3 ప్రయోగం కీలక ముందడుగు అని ఐఏఎఫ్ పేర్కొంది. ‘చంద్రయాన్ 3 మిషన్ ప్రపంచవ్యాప్తంగా నూతన ఆవిష్కరణకు సాక్ష్యం. చారిత్రాత్మక మైలురాయిని సాధించడం ద్వారా, చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధృవం దగ్గర దిగిన మొదటి దేశంగా నిలిచింది. అంతర్జాతీయంగా ఆశయం, సాంకేతిక పరాక్రమాన్ని ప్రదర్శిస్తుంది’ అని ఐఏఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.

చంద్రయాన్-3ను గత ఏడాది జూలై 6న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధృవంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios