ISRO Chairman EXCLUSIVE: "ఇస్రోలో అత్యుత్తమ ప్రతిభావంతులు పని చేస్తారా?" ఇస్రో చైర్మన్ సమాధానం ఇలా..
ISRO Chairman EXCLUSIVE: ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్‌తో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేష్ కల్రా ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ.. ఎన్నో విషయాలను వెల్లడిస్తూ.. ఇస్రోలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు సంబంధించిన ఓ ఆసక్తికర కథనాన్ని వివరించారు.

ISRO Chairman EXCLUSIVE: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 గ్రాండ్ సక్సెస్ అయ్యింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ సేకరించిన అత్యంత కీలక సమాచారాన్ని ఇస్రోకు చేర్చాయి. 12 రోజులపాటు నిర్విరామంగా పరిశోధనలు చేసిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు రాత్రి ప్రారంభం కావడంతో నిద్రావస్తలోకి వెళ్లిపోయాయి. అయితే.. రేపు (సెప్టెంబర్ 22 న) చంద్రుడి దక్షిణ ధ్రువంలో సూర్యోదయం కానున్నది. ఈ తరుణంలో యావత్ ప్రపంచం ఇస్రో వైపే చూస్తున్నాయి. నిద్రావస్తలో ఉన్న రోవర్, ల్యాండర్లు తిరిగి పనిచేస్తాయా? లేదా? అనే ఆసక్తికరంగా మారింది.
ఈ తరుణంలో చంద్రయాన్-3 భవిష్యత్వం గురించి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్‌తో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేష్ కల్రా ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ.. ఎన్నో విషయాలను వెల్లడిస్తూ.. ఓ ఆసక్తికర కథనాన్ని వివరించారు. ఇక్కడ డబ్బు ప్రజలను ఆకర్షించదని కీలక ప్రకటన చేశారు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్. ‘మీకు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారా’ అని ప్రశ్నిస్తే ..సమాధానం లేదు’ అని ఇస్రో చైర్మన్ చెప్పారు. ఆ సందర్బంగా ఓ ఉదాహరణ చెప్పారు.
ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల ఐఐటీలో ప్లేస్‌మెంట్ క్యాంప్ నిర్వహించాం. చాలా మంది విద్యార్థులు అందులో పాల్గొన్నారు. తొలుత వారికి ఇస్రోలో అందించే జీతభత్యాల గురించి వివరించాం. ఆ వివరాలు విన్నా.. తరువాత 60 శాతం మంది విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లిపోయారంటే మీరు నమ్మరు. ఈ రోజుల్లో ఐఐటీలో చదువుతున్న విద్యార్థులు ముందుగా ప్యాకేజీని చూస్తారు. అత్యధిక ప్యాకేజీతో వారు తమ కెరీర్ ను ప్రారంభించాలన్నారు. అటువంటి పరిస్థితిలో.. ఇస్రోలో డబ్బు ప్రతిభను ఆకర్షించదని చెప్పవచ్చు. అయితే మనం చేసే పనిని బట్టి మనలో అత్యుత్తమ స్తాయికి చేరుకుంటామని అన్నారు.
చంద్రయాన్-3 విజయవంతమైన తర్వాత చాలా మంది వ్యక్తులు మమ్మల్ని సంప్రదించారని, మాతో కలిసి పనిచేయాలనే కోరికను వ్యక్తం చేశారని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు. చంద్రయాన్ మిషన్ విజయవంతమవడంతో చాలా మంది ఇస్రోకు, దేశానికి తమవంతు సహకారం అందించాలని భావిస్తున్నారు. ఇలాంటివి అన్ని వేళలా జరుగుతూనే ఉంటాయి. కానీ, అలాంటి ఎంగేజ్‌మెంట్‌ల కోసం మాకు ఎలాంటి ప్రక్రియ లేదు. కాంట్రాక్ట్ నిబంధనలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్నాయని అన్నారు. మనం చేస్తున్న పనిని చేయడానికి తగిన ప్రతిభావంతులను నియమించుకున్నామా? అని ప్రశ్నించగా.. అవుననే సమాధానమిచ్చారు ఇస్రో చీఫ్.
పూర్తి ఇంటర్వ్యూ క్రింద చూడండి: