Asianet News TeluguAsianet News Telugu

Ved Prakash: మాజీ మేజర్‌ వేద్‌ ప్రకాశ్‌ కన్నుమూత.. పలువురు కాంగ్రెస్ నాయకుల సంతాపం

Ved Prakash: కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ సైనికుల విభాగం అధిపతి, మేజర్ (రిటైర్డ్) వేద్ ప్రకాష్ కన్నుమూశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నుంచి పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వరకు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Former Major Ved Prakash died in Congress headquarters KRJ
Author
First Published Jun 4, 2023, 4:07 AM IST

Ved Prakash: మాజీ సైనికుల విభాగం అధిపతి, మేజర్ (రిటైర్డ్) వేద్ ప్రకాష్ కన్నుమూశారు. 85 ఏళ్ల ఆయన గత కొంత కాలంగా ఆరోగ్యం కారణంగా బాధపడుతున్నారు. ఆయన మరణవార్తను కుమారుడు విపుల్ ప్రకాష్ తెలిపారు. విపుల్ ప్రకాష్ మాట్లాడుతూ.. 'ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మా నాన్న అకస్మాత్తుగా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పడిపోయాడు. దీంతో అతని తలకు గాయమైంది. ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే మృతి చెందాడు.

శుక్రవారం వేద్ ప్రకాష్ పుట్టినరోజు అని, ఆయనకు 85 ఏళ్లు నిండాయని తెలిపారు. మా నాన్న గుండె కాంగ్రెస్ అంటేనే కొట్టుమిట్టాడేదని, ఆ పార్టీతో ఆయనకు ఎంత అనుబంధం ఉంది. ఈ వయసులో కూడా రోజూ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లేవాడు ’’ అన్నారు. వేద్ ప్రకాష్ మృతి పట్ల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్, మరికొందరు పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ సంతాపం  

రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ.. కాంగ్రెస్ మాజీ సైనికుల సంస్థ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ కుటుంబంలో ముఖ్యమైన సభ్యుడు మేజర్ వేద్ ప్రకాష్ జీ మరణవార్త విచారకరం. ఎప్పుడూ దేశానికి అంకితమైన మేజర్ సాహెబ్ మరణం కాంగ్రెస్ కుటుంబానికి తీరని లోటు. ఆయన ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అని పేర్కొన్నారు. 

ప్రియాంక గాంధీ కూడా సంతాపం తెలిపారు. ప్రియాంక గాంధీ ట్వీట్ చేస్తూ.. కాంగ్రెస్ భావజాలానికి అంకితమైన మేజర్ వేద్ ప్రకాష్ జీ మరణ వార్త విచారకరం. మాజీ సైనికుల విభాగం చైర్మన్, మేజర్ వేద్ ప్రకాష్ జీ తన జీవితమంతా దేశ సేవకే అంకితం చేశారు. ఆయన మృతి కాంగ్రెస్ కుటుంబానికి తీరని లోటు. భగవంతుడు ఆయనకు పవిత్ర పాదాల చెంత స్థానం ప్రసాదించాలని, ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అని పేర్కొన్నారు. 

 మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ.. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీతో అనుబంధం ఉండి, మాజీ సైనికుల సంస్థలో కీలక పాత్ర పోషించిన మేజర్‌ వేద్‌ ప్రకాష్‌ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా దేశానికి సేవలందించిన తర్వాత మాజీ సైనికులను సంఘటితం చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. 

ఆయన గతంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో వార్‌రూమ్‌ను నడపడంలో, ఈశాన్య రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌గా ఉండటంతో సహా ముఖ్యమైన పాత్రలు పోషించాడని అన్నారు.  జమూ కాశ్మీర్ ,రక్షణ విషయాలపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. ఆయనకు హృదయపూర్వక నివాళులు, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios