Asianet News TeluguAsianet News Telugu

Fact Check: రాజకీయాల్లోకి అభిషేక్ బచ్చన్ వస్తున్నారా? సమాజ్‌వాదీ పార్టీ సమాధానం ఇదే!

అభిషేక్ బచ్చన్ రాజకీయాల్లోకి వస్తున్నారని, యూపీలోని ప్రయాగ్ రాజ్ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలు అవాస్తవాలని సమాజ్ వాదీ పార్టీ కొట్టివేసింది.

is abhishe bachhan entering politics, and contesting in lok sabha elections, samajwadi party denies kms
Author
First Published Jul 16, 2023, 8:11 PM IST

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు, ఇద్దరు సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్‌ల వారసుడు, మన్మర్జియా సినిమా హీరో అభిషేక్ బచ్ఛన్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆయన సమాజ్‌వాదీ పార్టీ టికెట్ పై ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగుతారనీ ఆ వార్తలు తెలిపాయి. తల్లిదండ్రుల అడుగుజాడల్లో సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లిన ఆయన వారి తరహాలోనే రాజకీయంలోనూ తన లక్‌ను పరిశీలించుకుంటారనే వాదనలు వచ్చాయి. ఇదే విషయాన్ని సమాజ్‌వాదీ పార్టీ నేతలతో ప్రస్తావించగా.. ఈ వార్తలను ఖండించారు. నిరాధారమైన వార్తలు అని, అసత్యాలనీ కొట్టిపారేశారు.

సాధారణంగా అభిషేక్ బచ్చన్ తన పై వచ్చే వదంతులను సోషల్ మీడియా వేదికగా త్వరగా రియాక్ట్ అవుతూ క్లారిఫై చేస్తూ ఉంటాడు. ప్రచారాలకు స్పష్టత ఇస్తాడు. కానీ, ఈ వదంతులపై ఆయన ఇంకా సైలెంట్‌గానే ఉన్నాడు. దీంతో సహజంగానే ప్రచారం ఇంకా బలంగా జరిగింది. ఈ ప్రచారాన్ని సమాజ్‌వాదీ పార్టీ కొట్టేయడంతో వదంతులకు బ్రేక్ పడింది. 

Also Read: Target 2024: రేపు విపక్షాల భేటీ, ఎల్లుండి ఎన్డీయే కూటమి భేటీ.. ఏ కూటమిలో ఎన్ని పార్టీలు?

తమ వైపు నుంచి ఎలాంటి సిఫార్సు చేయలేదని ఎస్పీ చెప్పింది. ప్రయాగ్ రాజ్ ఎస్పీ సిటీ ప్రెసిడెంట్ సయ్యద్ ఇఫ్తికర్ హుస్సేన్ సమాధానం ఇస్తూ.. ఈ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దింపుతారనే నిర్ణయం సమాచ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ చేతిలో ఉన్నదని ఆయన చెప్పారు. అయితే, కొన్ని మీడియా సంస్థలు అభిషేక్ బచ్చన్‌ను ప్రయాగ్ రాజ్ నుంచి అభ్యర్థిగా నిలబెడుతుందనే ప్రచారం చేశాయని, అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు.

ఈ నగర ఎస్పీ మాజీ అధ్యక్షుడు యోగేష్ చంద్ర యాదవ్ కూడా ఈ వార్తలు ఖండించారు. అంతేకాదు, కొన్ని నెలల క్రితం జయా బచ్చన్‌నే ఇక్కడి నుంచి ఎస్పీ బరిలోకి దింపుతున్నదనీ వార్తలు వచ్చాయని చెప్పారు. కానీ, ఈ వార్తలు అవాస్తవాలని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios