బిజీ రోడ్డులో కూలిన ఇనుప పిల్లర్.. షాకింగ్ వీడియో వైరల్...
ఓవర్ హెడ్ రైల్వే బ్రిడ్జికి సపోర్టుగా ఉన్న పిల్లర్ ఒక్కసారిగా ఒరిగిపోయి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో వాటర్ ట్యాంకర్, వాహనదారుడు తృటిలో తప్పించుకున్నారు.
బెంగళూరు : కర్ణాటకలో రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో ఇనుప స్తంభం గ్రిడ్ కూలిపోవడం కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం, ఆస్తినష్టం వాటిల్ల లేదు. రెప్పపాటు కాలంలో ఈ ప్రమాదంనుంచి వాహనాలు, పలువురు వాహనదారులు తప్పించుకున్నారు. ఈ ప్రమాదం రాష్ట్రంలోని మౌలిక సదుపాయాల నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తింది.
ఈ సంఘటన కర్ణాటకలోని వాణిజ్య కేంద్రమైన హుబ్బల్లిలో బుధవారం రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు జరిగింది. ఓవర్ హెడ్ రైల్వే బ్రిడ్జికి సపోర్టుగా ఉన్న పిల్లర్ ఒక్కసారిగా ఒరిగిపోయి... కుప్పకూలింది. ఈ సమయంలో ఓ వాటర్ ట్యాంకర్ సెకన్ ముందే దాన్ని దాటగా.. ఓ టూవీలర్ మీదున్న ఇద్దరు ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. వీడియో చూసిన వారికి ఈ ఘటన షాక్ కు గురి చేస్తోంది.
అదుపుతప్పి నదిలో పడిన మినీ ట్రక్కు.. 12 మంది దుర్మరణం..
"రైల్వే బ్రిడ్జి నెం 253 దగ్గర.. 4.2 మీటర్ల పొడవుతో.. హైట్ గేజ్‌ని ఏర్పాటు చేశారు. రాత్రివేళల్లో దానికంటే ఎత్తుగా ఉన్న వాహనం ఈ గేజ్‌ను ఢీకొట్టిందని అనుమానిస్తున్నారు. రోడ్డు వాహనాల ప్రకంపనల కారణంగా నిర్మాణం మరింత బలహీనపడిందని అనుమానిస్తున్నారు. నిర్మాణం ఒకవైపు వంగి, ఆ తర్వాత కిందకు పడిపోయింది" అని సౌత్ వెస్ట్రన్ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
"నిర్మాణం తొలగించబడింది. కొత్త హైట్ గేజ్ ఏర్పాటు చేస్తాం. ఇంకా, రంబుల్ స్ట్రిప్‌లు, అదనపు సంకేతాలు వెంటనే రహదారిపై పెడతాం" అని అందులో తెలిపారు.