రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ బోర్డు షాకిచ్చింది. రాజధాని, శతాబ్ధి, దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లలో టీ, టిఫిన్, భోజనం రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పర్యాటక, క్యాటరింగ్ రైల్వే బోర్డు డైరెక్టర్ గురువారం సర్క్యూలర్ జారీ చేశారు.

కొత్త మెనూ, రేట్లు, టికెటింగ్ విధానం 15 రోజుల తర్వాత అందిస్తామని.. పెంచిన రేట్లు సర్క్యూలర్ జారీ చేసిన తేదీ నుంచి 120 రోజుల తర్వాత వర్తిస్తాయని తెలిపింది. రేట్ల సవరణ తర్వాత రాజధాని, దురంతో, శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లలో ఒక కప్పు టీ ధర రూ.10 నుంచి రూ.15కి చేరింది.

అదే స్లీపర్ క్లాస్, సెకండ క్లాస్ ఏసీ బోగీల్లో అయితే టీ ధర రూ. 20, భోజనం విషయానికి వస్తే దురంతో ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్ క్లాస్‌లో లంచ్/ డిన్నర్‌కు రూ.120 రూపాయలు పెంచారు. గతంలో దీని ధర రూ.80. అలాగే సదరు రైళ్లలో సాయంత్రం వేళలో ఫస్ట్ క్లాస్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో సాయంత్రం వేళల్లో టీ ధర రూ. 35, అల్పాహారం రూ.140, లంచ్ డిన్నర్‌ రూ.245 పెరిగింది. 

Also Read:జియో రైల్‌తో.. ఐఆర్‌సీటీసీకి థ్రెట్ తప్పదా

దేశవ్యాప్తంగా జియో ఫోన్‌ తన వినియోగదారుల ఆదరాభిమానాలను మరింత చూరగొనేందుకు టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో మరో సరికొత్త అప్లికేషన్‌తో ముందుకు వచ్చింది. ప్రస్తుతం రైలు టిక్కెట్లను బుక్‌ చేసుకోవడానికి ఉపయోగిస్తున్న ఐఆర్సీటీసీ యాప్‌ మాదిరిగానే సేవలందించే ‘జియో రైల్’ యాప్‌ను రిలయన్స్ జియో ప్రారంభించింది.

రైల్వే టిక్కెట్ బుకింగ్ నుంచి రద్దు వరకు సకల సౌకర్యాలు
ఈ యాప్‌ ద్వారా వినియోగదారులు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, ఈ- వాలెట్లను ఉపయోగించి రైలు టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు.  రైళ్ల రాకపోకల సమాచారం, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌, సీట్ల లభ్యత, టిక్కెట్ల రద్దు వంటి సేవలను ఈ యాప్‌ ద్వారా వినియోగించుకోవచ్చు. 

Also read:ఇక మీదట ‘‘ఐఆర్‌సీటీసీ ’’ ఉండదట

తత్కాల్ టిక్కెట్ బుకింగ్ ఫెసిలిటీ కూడా ‘జియో రిలయన్స్’లో రెడీ
చివరి నిమిషాల్లో ప్రయాణం కోసం బుక్‌ చేసుకునే తత్కాల్‌ టికె‌ట్‌లకు కూడా ఈ యాప్‌ను ఉపయోగించి బుక్‌ చేసుకోవచ్చు. ఒకవేళ వినియోగదారులకు ఐఆర్సీటీసీ ఖాతా లేకున్నా ‘జియో రైల్’ యాప్‌లో కొత్త ఖాతా సృష్టించుకోవచ్చు. ఈ అప్లికేషన్‌ ‘జియో యాప్‌ స్టోర్‌’లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.

బారులు తీరే బాధలు.. ఫీజు చెల్లింపు సమస్యలకు ఇక చెక్
తద్వారా గంటల కొద్దీ క్యూ లైన్‌లో నిలబడటమో, టిక్కెట్ బుకింగ్ ఏజెంట్లకు భారీగా ఫీజు చెల్లించుకోవాల్సిన అవసరమో రాదు. అంతేకాదు జీవితంలో డిజిటల్ లైఫ్ సౌకర్యవంతమైన జీవితాన్ని కూడా అందుబాటులోకి తెస్తుంది మరి.