Asianet News TeluguAsianet News Telugu

జియో రైల్‌తో.. ఐఆర్‌సీటీసీకి థ్రెట్ తప్పదా

ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ఒక్కో అడుగు ముందుకేస్తుంటే.. ఒకనాటి టెలికం రారాజు భారతీ ఎయిర్ టెల్ వెనుకడుగు వేసింది. ఐఆర్సీటీసీ మాదిరిగా జియో రైల్ పేరిట టిక్కెట్ల రిజర్వేషన్ మొదలు అన్ని రకాల రైల్వే సర్వీసులు పొందేందుకు కొత్త యాప్ రూపొందించింది రిలయన్స్ జియో.

Jio Rail App Launched For JioPhone and JioPhone 2 Users
Author
Mumbai, First Published Jan 29, 2019, 12:04 PM IST

దేశవ్యాప్తంగా జియో ఫోన్‌ తన వినియోగదారుల ఆదరాభిమానాలను మరింత చూరగొనేందుకు టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో మరో సరికొత్త అప్లికేషన్‌తో ముందుకు వచ్చింది. ప్రస్తుతం రైలు టిక్కెట్లను బుక్‌ చేసుకోవడానికి ఉపయోగిస్తున్న ఐఆర్సీటీసీ యాప్‌ మాదిరిగానే సేవలందించే ‘జియో రైల్’ యాప్‌ను రిలయన్స్ జియో ప్రారంభించింది.

రైల్వే టిక్కెట్ బుకింగ్ నుంచి రద్దు వరకు సకల సౌకర్యాలు
ఈ యాప్‌ ద్వారా వినియోగదారులు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, ఈ- వాలెట్లను ఉపయోగించి రైలు టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు.  రైళ్ల రాకపోకల సమాచారం, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌, సీట్ల లభ్యత, టిక్కెట్ల రద్దు వంటి సేవలను ఈ యాప్‌ ద్వారా వినియోగించుకోవచ్చు. 

తత్కాల్ టిక్కెట్ బుకింగ్ ఫెసిలిటీ కూడా ‘జియో రిలయన్స్’లో రెడీ
చివరి నిమిషాల్లో ప్రయాణం కోసం బుక్‌ చేసుకునే తత్కాల్‌ టికె‌ట్‌లకు కూడా ఈ యాప్‌ను ఉపయోగించి బుక్‌ చేసుకోవచ్చు. ఒకవేళ వినియోగదారులకు ఐఆర్సీటీసీ ఖాతా లేకున్నా ‘జియో రైల్’ యాప్‌లో కొత్త ఖాతా సృష్టించుకోవచ్చు. ఈ అప్లికేషన్‌ ‘జియో యాప్‌ స్టోర్‌’లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.

బారులు తీరే బాధలు.. ఫీజు చెల్లింపు సమస్యలకు ఇక చెక్
తద్వారా గంటల కొద్దీ క్యూ లైన్‌లో నిలబడటమో, టిక్కెట్ బుకింగ్ ఏజెంట్లకు భారీగా ఫీజు చెల్లించుకోవాల్సిన అవసరమో రాదు. అంతేకాదు జీవితంలో డిజిటల్ లైఫ్ సౌకర్యవంతమైన జీవితాన్ని కూడా అందుబాటులోకి తెస్తుంది మరి. 

ఎయిర్‌టెల్‌ వెనుకడుగు.. అమల్లోకి రెండు కొత్త ప్లాన్లు
రెండేళ్ల క్రితం వెలుగు వెలిగిన టెలికం కంపెనీ ‘భారతీ ఎయిర్‌టెల్‌’  దెబ్బకు దిగి వచ్చింది. దేశీయంగా తన స్థానాన్ని కాపాడుకునేందుకు భారీ కసరత్తే చేస్తోంది. ఈ నేపథ్యంలో లైఫ్‌ టైం యాక్టివేషన్‌ విషయమై రెండు కొత్త ప్లాన్లను తిరిగి ప్రారంభించింది. 

రూ.100, రూ.500 ప్లాన్లతో ఇలా ఎయిర్ టెల్
కోట్లమంది ఖాతాదారులు నష్టపోయినా ఫరవాలేదని భారతీ ఎయిర్ టెల్ ఇటీవల జీవితకాల చందాదారులకు కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన రూ.30 కనీస రీచార్జ్‌ పథకానికి ఖాతాదారులనుంచి స్పందన కరువైంది. దీంతో ఎయిర్‌టెల్‌ వెనక్కి తగ్గక తప్పలేదు. కొత్త ఎత్తుగడతో తాజాగా రూ.100, రూ. 500 విలువైన ప్రీపెయిడ్‌ ప్లాన్లను తిరిగి అందుబాటులోకి తెచ్చింది. 

కొత్త ప్లాన్లలో ఓన్లీ టాక్ టైం
ఈ  ప్లాన్లలో డేటా, ఎస్‌ఎంఎస్‌ల వసతి అందించలేదు.  కేవలం టాక్‌  టైంను మాత్రం అందిస్తోంది. దీనితోపాటు లైఫ్‌ టైం ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఆఫర్‌ చేస్తోంది. ఈ రెండు ప్లాన్లు  మై ఎయిర్‌టెల్‌ యాప్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

ఇలా ఎయిర్ టెల్ కాల్స్ పరిమితులు
రూ.100  ప్రీపెయిడ్‌ రీచార్జ్‌ ప్లాన్‌లో 28 రోజుల పాటు ఔట్ గోయింగ్ కాల్స్ చేసుకోవచ్చు. టాక్‌ టైం రూ.81.75 గల ఈ ప్లాన్‌లో అపరిమితంగా ఇన్‌ కమింగ్‌ కాల్స్‌ స్వీకరించొచ్చు.  రూ.500 ప్రీపెయిడ్‌ రీచార్జ్‌ ప్లాన్‌ప్లాన్‌లో టాక్‌టైం రూ.420.73 అయితే దాని వాలిడిటీ 28 రోజులు ఉంటుంది. అపరిమిత ఇన్‌ కమింగ్‌ కాల్స్‌ స్వీకరించడానికి అనుమతినిస్తుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios