Asianet News TeluguAsianet News Telugu

వాటర్ బాటిల్‌ ను ఎంఆర్‌పీ కంటే రూ.5 ఎక్కువకు అమ్మినందుకు రూ.లక్ష జరిమానా..

రైలులో వాటర్ ధర రూ. 15 గా నిర్ణయించగా..తన నుంచి రూ.20 వసులూ చేశారని ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై స్పందించిన రైల్వే అధికారులు సదరు కాంట్రాక్టర్‌పై రూ. 1 లక్ష జరిమానా విధించారు.  

IRCTC contractor fined Rs 1 lakh by Railways for charging Rs 5 extra on water bottle
Author
First Published Dec 18, 2022, 6:40 PM IST

'జాగో గ్రాహక్ జాగో'.. అంటూ వినియోగదారులను ప్రభుత్వం నిరంతరం అప్రమత్తం చేస్తునే ఉంటుంది. ఏ వస్తువుపైనా గరిష్ఠ చిల్లర ధర (MRP) కంటే ఎక్కువ చెల్లించకూడదని  ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉంటుంది. అలాగే.. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు ఎలాంటి వస్తువులను విక్రయించవద్దని దుకాణదారులు, విక్రయదారులను కూడా ప్రభుత్వం హెచ్చరిస్తునే ఉంటుంది. కానీ.. ఈ విషయాన్ని చాలామంది అర్థం చేసుకోరు. పట్టించుకోరు కూడా..

మరి ముఖ్యంగా ఇలాంటి ఘటనలు రైల్వే స్టేషన్స్ ల్లో, బస్సు స్టాండుల్లో.. సినిమా థియేటర్స్ లలో.. తీర్థయాత్రల్లో జరుగుతుంటాయి. అక్కడ MRPపై కంటే ఎక్కువ ధరకు వస్తువులను అమ్మినా.. అప్పుడు మనం ఉన్న పరిస్థితిలో అమ్మేవాడు ఎంత చెప్పితే.. అంతా ఇచ్చి.. మనకు కావాల్సింది కొనుకుని వస్తాం.. కానీ అందరూ ఒక్కలా ఉండరు కాదా..? అలాంటి విషయాలను కచ్చితంగా ప్రశ్నించే తీరుతారు. అలాంటి ఈ పరిమాణం ఓ వ్యక్తికి ఎదురైంది. రైలులో వాటర్ బాటిల్ కు నిర్ణయించిన ధర కంటే.. రూ. 5 ఎక్కువ వసూలు చేశారు. దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి రైల్వే అధికారులకు  ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఘటనను రికార్డు చేసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో  స్పందించిన రైల్వే అధికారులు సంబంధించిన కాంట్రాక్టర్ పై రూ. 1 లక్ష జరిమానా చెల్లించింది.  

వివరాల్లోకెళ్తే.. శివంభట్ అనే వ్యక్తి గురువారం (డిసెంబర్15,2022) నాడు లక్నో ఎక్స్ ప్రెస్ లో ఛండీగడ్ నుంచి షాజహాన్ పూర్ కు  ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు దాహమేయింది. ఓ వాటర్ బాటిల్ కొనాలని నిర్ణయించుకున్నారు. అదే బోగిలో వాటర్ బాటిల్స్ అమ్ముతున్న వ్యక్తిని పిలిచాడు. బాటిల్ ఎంత అని అడిగా.. రూ. 20లు అని చెప్పాడు వ్యక్తి.  ఎమ్మార్పీ చూసిన శివంభట్.. దీనిపై ఎమ్మార్పీ ధర రూ.15 ఉంటే.. రూ.20 చెబుతావేంటి? అని ప్రశ్నించాడు. దానికి సదరు వ్యక్తి .. కావాలంటే తీసుకో.. లేదంటే వదిలేయ్ అని నిర్లక్ష్యంగా బదులిచ్చారు. మరో స్టేషన్ రావడానికి చాలా సమయం పట్టేంట్లుంది. ఓ వైపు దాహమేస్తుంది. దీంతో వేరే దారిలేక రూ.20లు ఇచ్చి వాటర్ బాటిల్ కొన్నాడు. కానీ ఈ తతంగాన్ని అంత తన సెల్ ఫోన్లో రికార్డు చేశారు. ఆ వీడియోను  రైల్వే ఉన్నతాధికారులకు పంపించాడు.
 
ఈ ఫిర్యాదుపై ఉత్తర రైల్వే వెంటనే చర్యకు దిగింది. ఆ రైలులో వాటర్ బాటిల్స్ అమ్ముతున్న వ్యక్తిని గుర్తించింది. ఆ చండీగఢ్ లక్నో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో లైసెన్స్ పొందిన కాంట్రాక్టర్ ఉత్తరప్రదేశ్ గోండాకు చెందిన చంద్రమౌళి మిశ్రా అని తెలిసింది. దీంతో అతనిపై చర్యలు తీసుకున్నారు. అలాగే.. రైల్వే చట్టంలోనే సెక్షన్ 144(1)కింద లక్నో ఎక్స్ ప్రెస్ లో వాటర్ బాటిల్స్ అమ్మకానికి లైసెన్స్ పొందిన మేనేజర్ రవి కుమార్‌ను అరెస్ట్ చేశారు. కాంట్రాక్టర్ కు రూ.లక్ష జరిమానా విధించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు అంబాలా డివిజన్ సీనియర్ డీసీఎం హరిమోహన్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios