ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే..ఐఫోన్ మీ చేతికి

iPhone X, iPhone 8 Plus Now Offered With Zero Down Payment EMIs in India
Highlights


యాపిల్ బంపర్ ఆఫర్
 

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ యాపిల్.. వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. పైసా కట్టకుండా తమకు కావాలనుకున్న ఐఫోన్‌ను తీసుకెళ్లే సదుపాయం కల్పించింది. పూర్తిగా జీరో డౌన్ పేమెంట్ విధానంలో ఐఫోన్‌ను కొనుగోలు చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో దేశంలోని అన్ని రిటెయిల్ స్టోర్స్‌లోనూ ప్రస్తుతం ఐఫోన్లను జీరో డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చు. 

యాపిల్‌కు చెందిన ఐఫోన్ 7, 7 ప్లస్, 8, 8 ప్లస్, ఐఫోన్ X లను జీరో డౌన్ పేమెంట్‌తో ప్రస్తుతం వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. దీంతో ఎలాంటి డబ్బులు ముందస్తుంగా చెల్లించకుండానే ఐఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. దేశంలోని దాదాపు అన్ని ఫైనాన్స్ సంస్థల నుంచి ఈ సదుపాయాన్ని అందిస్తున్నారు. హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, క్యాపిటల్ ఫస్ట్ తదితర సంస్థలు ఐఫోన్లను జీరో డౌన్‌పేమెంట్‌తో ప్రస్తుతం అందిస్తున్నాయి. ఇందుకు గాను 18 నెలల ఈఎంఐ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో పెద్దగా ఇబ్బంది పడకుండా ఐఫోన్‌ను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. 

ఇక ఐఫోన్లను క్రెడిట్ కార్డులు ఉపయోగించి కొన్నవారికి 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు. పలు ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులపై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 30 వరకు ఇలా జీరో డౌన్‌పేమెంట్‌తో ఐఫోన్లను కొనుగోలు చేసే ఆఫర్‌ను యాపిల్ కొనసాగించనుంది. 
 

loader