ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. వారం రోజుల సమయంలో ఈడీ ముందు హాజరవ్వడం ఇది రెండవ సారి.. ఐఎన్ఎక్స మీడియాలోకి వచ్చిన రూ. 305 కోట్ల విదేశీ పెట్టుబడుల్లో అవకతవకలు జరిగాయని.. విదేశీ పెట్టుబడుల  ప్రొత్సాహక బోర్డు ఈ నిధులకు ఆమోదముద్ర వేయడంలో నాడు కేంద్రమంత్రిగా ఉన్న చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం తండ్రి అధికారాన్ని ఉపయోగించుకున్నారని. అందుకు చిదంబరం కూడా సహకరించారన్నది సీబీఐ ఆరోపణ.